Kalki 2898 AD: అమెజాన్ ప్రైమ్ ను తిట్టిపోస్తున్న ప్రభాస్ అభిమానులు.!

ఏదైనా సినిమా ఓటీటే వెర్షన్ రిలీజ్ అవుతుంది అంటే అభిమానులు చాలా ఆనందపడతారు. బోలెడన్ని ఫ్యాన్ ఎడిట్స్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎలివేషన్ సీన్స్ ను రిపీట్స్ లో చూసుకోవచ్చు అనేది అభిమానుల ఆశ. అలాగే.. ఒక్కోసారి ఎడిటింగ్ లో కట్ చేసిన సీన్స్ ను కూడా ఓటీటీ వెర్షన్ లో యాడ్ చేస్తుంటారు. ఆ సన్నివేశాల కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. కానీ.. “కల్కి” ( Kalki 2898 AD ఓటీటీ రిలీజ్ విషయంలో మాత్రం ప్రభాస్ ( Prabhas ) అభిమానులు బాధపడుతున్నారు.

Kalki 2898 AD

చాలా సీన్స్ లో అనవసరమైన కట్స్ ఉన్నాయని, కొన్ని మంచి షాట్స్ నిడివి తగ్గాయని, కొన్ని చోట్ల లిరిక్స్ కూడా మారిపోయాయని మొత్తుకొంటున్నారు. అసలు “కల్కి” ఓటీటీలో వచ్చిన మార్పులేమిటో చూద్దాం. టైటిల్ కార్డ్ పడగానే వీరన్ & మరియం మధ్య వచ్చే మాటలు కట్ అయిపోయాయి, భైరవ ఎంట్రీ సీన్ లో కప్ప డైలాగ్ ను కట్ చేసారు, భైరవ 10 వేల యూనిట్స్ కోసం ఫైట్ చేయలేను అనే డైలాగ్ కట్ చేశారు, ఇంట్రో ఫైట్ తర్వాత డ్యామేజ్ కి యూనిట్స్ కట్టే సీన్ కట్ చేసారు,

ట టక్కర పాటలో దిశా పటాని బీచ్ లోకి వెళ్ళే సీన్ & కాంప్లెక్స్ ను డ్రోన్ షాట్ లో చూపించే సీన్ ను కట్ చేసారు, భైరవను కాంప్లెక్స్ బయటపడేసే సీన్ లో వచ్చే డైలాగ్ ను కట్ చేసారు, సుమతి మంటల్లో నడుచుకుంటూ వెళ్లే సన్నివేశంలో లిరిక్స్ మార్చారు, ఇంటర్వెల్ బ్యాంగ్ లో టైటిల్ కార్డ్ ని మొత్తానికి లేపేసారు, అశ్వద్ధామ-భైరవ ఫైట్ సీన్ లో ప్రభాస్ షాట్ ఒకటి కట్ చేసారు..

ఇలా సినిమాలో బోలెడన్ని చిన్నపాటి మార్పులు ఉన్నాయి. ఇంకా ఏమైనా కొత్త సీన్స్ యాడ్ చేస్తారేమో అని అభిమానులు ఎదురుచూస్తుంటే.. ఇలా ఉన్న సీన్స్ ను ట్రిమ్ చేయడం పట్ల ప్రభాస్ అభిమానులు కోపం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కరెక్షన్స్ ను చిత్రబృందం చేసిందా లేక అమెజాన్ ప్రైమ్ టీమ్ అతితెలివి ప్రదర్శించిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ కట్స్ ను ఇలాగే కొనసాగిస్తారా లేక మళ్ళీ కరెక్టెడ్ వెర్షన్ ను అప్డేట్ చేస్తారా అనేది చూడాలి!

 ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రీరిలీజ్ అవుతున్న రెండు సినిమాలు.. కానీ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus