చై సామ్ ఆ విషయంలో గొడవ పడ్డారా..?

ఏ మాయ చేశావె, మనం, ఆటో నగర్ సూర్య, మజిలీ సినిమాల్లో జంటగా నటించిన చైతన్య సమంత నాలుగేళ్ల క్రితం ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సమంత చైతన్యకు స్క్రిప్ట్ ల విషయంలో తన వంతు సహాయం చేస్తూ చైతన్యకు హిట్లు వచ్చే విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే చైతన్య మాత్రం సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్ గా ఉండరు.

సమంత చైతన్య జోడీ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకోగా తాజాగా ఒక విషయంలో చైతన్య సమంత గొడవ పడ్డారని తెలుస్తోంది. చైతన్య సమంత మధ్య జరిగిన చిన్న గొడవకు పెంపుడు కుక్క హష్ కారణమని సమాచారం. సమంత హష్ చేసే అల్లరికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను తరచూ షేర్ చేస్తుంటారు. ఆహాలో ప్రసారమైన సామ్ జామ్ టాక్ షోకు నాగ చైతన్య గెస్ట్ గా వచ్చిన సమయంలో కూడా హష్ గురించి వాదించుకున్న సంగతి తెలిసిందే.

హష్ తన చుట్టే ఎప్పుడూ తిరుగుతాడని సమంత చెప్పగా నీ చుట్టూ ఎప్పుడూ తిరిగినా నాతోనే హష్ ఎక్కువగా ఉంటాడని హష్ కు తనంటేనే ఎక్కువ ఇష్టమని చైతన్య తెలిపారు. తాజాగా సమంతకు డిజైనర్ ఫ్రెండ్ అయిన క్రష్ బజాజ్ జవేరి అనే వ్యక్తి హష్ ను పోలి ఉన్న బొమ్మను చైతన్య సమంతలకు బహుమతిగా ఇచ్చారు. హష్ ను పోలి ఉన్న ఆ బొమ్మ ఇద్దరికీ తెగ నచ్చేసింది.

అయితే ఈ బొమ్మ ఎవరికి సొంతమనే విషయంలో చైతన్య, సమంత ఇద్దరూ గొడవ పడ్డారట. కొంత సమయం వాదించుకున్న తరువాత ఆ బొమ్మ ఇద్దరికీ సొంతమైందని సమంత తెలిపారు. సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య లవ్ స్టోరీ, థ్యాంక్యూ సినిమాలలో నటిస్తుండగా సమంత శాకుంతలం సినిమాలో నటిస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus