అందాన్ని తగ్గించుకొని అభినయాన్ని పెంచిన కథానాయికలు

సినిమాలో హీరోయిన్స్ అంటే అందంగా ఉండాలి. ఆ అందంతోనే ఆడియన్స్ ని ఆకర్షించాలి. అందుకే మంచి డ్రస్సులతో.. మేకప్ తో మరింత అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. అదే మేకప్ లేకుండా కనిపించాలంటే.. ముతక చీరలు.. మాసిన డ్రస్సులు వేసుకోవాలంటే చాలామంది వెనుకడుగు వేస్తారు. తమకి అవకాశాలు రావేమోనని భయపడతారు. అయితే కొంతమంది తారలు దైర్యంగా ముందడుగు వేసి డీ గ్లామర్ రోల్స్ పోషించారు. తమ అభినయంతో మెప్పించారు. అటువంటి వారిపై ఫోకస్..

1. సమంత (రంగస్థలం)ఎప్పుడూ డిజైనర్ వేర్స్ తో ఆకట్టుకునే క్యూట్ బ్యూటీ సమంత.. రంగస్థలం సినిమాలో తొలిసారి పల్లెటూరి పిల్లలా లంగా వోణీ ధరించింది. అది కూడా పేద పిల్లలా.. బర్రెలు కాసే రామలక్ష్మిలా ముస్తాబయింది. ఇంకా ఈ సినిమా రిలీజ్ కాలేదు కానీ రామలక్ష్మి టీజర్ ఆమె ఎలా ఉండబోతుందో తెలిసింది. చిలిపి పనులతో హీరోస్ ని పడగొట్టే పాత్రలు పోషించిన ఈ బ్యూటీ డీ గ్లామర్ పాత్రలో ఎంత మేర మెప్పిస్తుందో చూడాలి.

2. ప్రియమణి (విలన్) విలన్ సినిమాలో ప్రియమణి చిన్న పాత్ర చేసింది. అది కూడా మేకప్ అవసరం లేని రోల్. విక్రమ్ చెల్లెలుగా
డీ గ్లామర్ రోల్లో నటనతో మెప్పించింది.

3. తమన్నా (అభినేత్రి) అభినేత్రిలో తమన్నా రెండు రోల్స్ పోషించింది. ఒకటి గ్లామర్ ది కాగా మరొకటి డీ గ్లామర్ రోల్. రెండింటిని చక్కగా పోషించింది.

4. తమన్నా (బాహుబలి )బాహుబలి సినిమాలో రెండు పాటల్లో మినహా సినిమా మొత్తం ఒకే డ్రస్సులో… అది కూడా డీ గ్లామర్ గా కనిపించి అలరించింది.

5. అనుష్క (బాహుబలి) బాహుబలి బిగినింగ్ చిత్రంలో అనుష్క దేవసేన పాత్రలో ముతక చీరలో, మాసిన జుట్టుతో.. వడలిన చర్మంతో కనిపిస్తుంది. స్టార్ హీరోయిన్ గా పేరొందిన స్వీటీ ఈ రోల్ చేసి మరింతమందిని అభిమానులను చేసుకుంది.

6. సంజన (దండుపాళ్యం 2 )దండుపాళ్యం 2 లో సంజన ని గుర్తు పట్టలేము. అసలు ఆమె పూర్తిగా రూపం మార్చివేసింది. రోడ్ పైన కాగితాలు వేరుకునే అమ్మాయిలా తయారై ఔరా అనిపించింది. ఇంత కష్టపడ్డా ఆమె కెరీర్ కి ఈ రోల్ ఉపయోగ పడలేదు.

7. రితిక సింగ్ (గురు) చేపలు అమ్ముకునే అమ్మాయిలాగా రితిక సింగ్ గురు సినిమాలో భలే నటించింది. ఆ విధంగానే డ్రస్సులు, మేకప్ వేసుకొని సహజంగా నటించింది. అందరితో అభినందనలు అందుకుంది.

8. రాధికా ఆప్టే (రక్త చరిత్ర) యదార్ధ సంఘటనలు… కల్పిత కథతో తెరకెక్కిన రక్త చరిత్ర సినిమాలో రాధికా ఆప్టే చాలా నేచురల్ గా నటించింది. మేకప్ జోలికి వెళ్లకుండా మెప్పించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus