చెక్ బౌన్స్ కేసు లో ఆ స్టార్ హీరోయిన్ కు అరెస్ట్ వారెంట్..!

తన గ్లామర్ తో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది అమీషా పటేల్. తెలుగులో కూడా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే తెలుగులో ఈమె అంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. దీంతో మళ్ళీ బాలీవుడ్ బాట పట్టింది. తరువాత అక్కడ కూడా కొత్త హీరోయిన్లు రావడంతో ఈమెకు ఆఫర్లు తగ్గిపోయాయి. ఎదో దొరికిన సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇక తాజాగా ఈమె చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కోవడంతో ఈమె పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది.

‘దేశీ మ్యాజిక్’ అనే చిత్రాన్ని నిర్మించడానికి అమీషా పటేల్ ఆమె భాగస్వామి.. అజయ్ కుమార్ అనే వ్యక్తి నుండీ 2.5 కోట్లు అప్పుగా తీసుకున్నారట. కానీ వాళ్ళు ఆ చిత్రం చేయలేదట.ఇక అజయ్ కుమార్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే.. అమీషా పటేల్ అతనికి చెక్ ఇచ్చిందట. అయితే ఆ చెక్ బౌన్స్ అయ్యిందని ఆయన ఆరోపిస్తున్నాడు అజయ్. ఆమెని మళ్ళీ తన డబ్బులు ఇవ్వాలని అజయ్ కోరగా ఆమె తన మనుషులతో బెదిరించిందని ఆయన చెబుతున్నాడు. ఈ కారణంతో ఆయన రాంచి కోర్టును ఆశ్రయించాడు. ఇక కోర్టు ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ విషయంపై అమీషా పటేల్ తన ట్విట్టర్ ద్వారా స్పందించింది. “నిర్మాత అజయ్ కుమార్ నాకు అప్రతిష్ఠపాలు తీసుకురావడానికే ఈ కేసు పెట్టాడు. ప్రజలలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. దీనిపై నేను న్యాయ పోరాటం చేస్తాను. దీనిపై కొంతకాలం మౌనంగా ఉందామనుకున్నాను.. కానీ అభిమానుల ఆందోళన చూసి స్పందిస్తున్నాను…’ అంటూ చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus