సమాజంలోని కొన్ని అంశాలపై స్పందించాలంటే… చెంపపెట్టులా మాట్లాడాలి అంటే చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ భలేగా మాట్లాడతారు అని చెప్పాలి. దేవాలయంలో కానీ, బయట కానీ ఆయన చెప్పే విషయాలు చాలా పక్కాగా ఉంటాయి. అలాగే చెంపదెబ్బ కొట్టినట్లే ఉంటాయి. తాజాగా ఆయన ‘హను – మాన్’ సినిమా థ్యాంక్యూ మీట్‌కి వచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ ఇచ్చారు. దీంతో ఆ మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయియ.
తేజ సజ్జా ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాను ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ సాధించినందుకుగాను చిత్రబృందం థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ మాట్లాడారు. తన నామాన్ని జపిస్తే బుద్ధి, బలం, ధైర్యం, నిర్భయత్వాన్ని శ్రీరామభక్త ఆంజనేయస్వామి ప్రసాదిస్తారు. ప్రేక్షకులంతా ఆయన్ని తలచుకునేలా చేసిన ఈ చిత్రబృందానికి నా కృతజ్ఞతలు అని అన్నారు.
ఈ సినిమాను (Hanu Man) రూపొందించిన యంగ్ టీమ్ అద్భుతాన్ని సృష్టించింది. సినిమా చూసి నాకు మాటలు రాలేదు. కథ విషయంలో ప్రశాంత్ సోదరి చక్కగా రీసెర్చ్ చేశారు అని చెప్ఆపరు. ప్రస్తుత రోజుల్లో సినిమా కీలక మాధ్యమంగా మారింది. ఈ క్రమంలో సమాజానికి విలువైన చిత్రాలను అందించాలి. ‘హను – మాన్’ సినిమాలో ఎక్కడా అసభ్యత కనిపించలేదు. ఆడవాళ్లను వక్రీకరించి చూపిస్తేనే హిట్ అవుతుందనే ఆలోచన ఉన్నవాళ్లకు ఈ సినిమా ఒక చెంపదెబ్బ అని వ్యాఖ్యానించారు అర్చకులు.
ఇక ఇదే కార్యక్రమంలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ చిన్నప్పటి నుండి ఏం చేసినా ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ఎనిమిదేళ్ల క్రితమే తేజతో సినిమా చేయాలని ప్లాన్ చేశా. బడ్జెట్ కారణాలతో అప్పుడు సినిమా పట్టాలెక్కలేదు. అప్పటి నుండి మేం ట్రావెల్ చేస్తున్నాం. ‘జాంబిరెడ్డి’ సినిమాతో మా కాంబో సెట్ అయ్యింది. ఫ్రెండ్‌ని హీరో చేయడం సంతృప్తినిస్తుంది. స్టార్‌ని చేయడం అంతకుమించిన ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పారు ప్రశాంత్ వర్మ. అలాగే రవితేజ అంగీకరిస్తే ఆయనతో ఓ సినిమా చేస్తా అని కూడా చెప్పారు.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!