పోలీసులకు క్షమాపణలు చెప్పన చిన్మయి

  • June 28, 2019 / 05:16 PM IST

‘మీటూ’ ఉద్యమం మొదలైన తరువాత సౌత్ లో దానిని మరింత పాపులర్ చేసింది మాత్రం సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయినే అనడంలో సందేహమే లేదు. ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుతో పాటు మరికొందరు సెలబ్రిటీల నిజస్వరూపాన్ని బయటపెట్టి తెరవెనక చేసే చీకటి పనులు, లైంగిక వేధింపుల గురించి సంచలన కామెంట్లు చేసి సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆమెకు కొందరు ఆఫర్లు లేకుండా చేసినా ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. ఏమైనా ఆమె ధైర్యానికి మెచ్చుకోవలసిందే. ఇది పక్కన పెడితే.. తాజాగా సింగర్ చిన్మయి యూపీలో ఓ పోలీసు పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ప్రదేశ్ కు చెందిన ఓ పోలీస్ అత్యాచార బాధితురాలిని కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేసినట్లుగా ట్విట్టర్లో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. దీని పై చిన్మయి స్పందిస్తూ ‘చట్టాన్ని కాపాడాల్సిన పోలీసే ఇలా ప్రవర్తిస్తే ఎలా?’ అంటూ ట్వీట్ చేసింది చిన్మయి.

ఈ ట్వీట్‌పై ఉత్తరప్రదేశ్ పోలీస్ సంస్థ స్పందించి … అది ఫేక్ న్యూస్ అని చెప్పుకొచ్చింది. ‘2017లో జరిగిన ఘటన గురించి 2019లో ఓ సెలబ్రిటీ పోస్ట్‌ చేయడం మేము ఊహించలేకపోతున్నాం అంటూ యూపీ పోలీస్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.అప్పట్లో సదరు మహిళ తన పై అత్యాచారం జరిగిందని తప్పుడు కేసు పెట్టింది. ఫిర్యాదు తీసుకున్న ఎస్సై కూడా తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. విచారణలో ఆమె ఆరోపణల్లో నిజం లేదని తెలిసిన తర్వాత కేసు కొట్టివేయడం కూడా జరిగింది అంటూ యూపీ పోలీసులు’ చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే చిన్మయి స్పందిస్తూ… “ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మహిళల్లో చైతన్యం రావాలి, బాధితులకు న్యాయం జరుగాలి… ఈ ఉద్దేశ్యంతోనే నేను వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను. నేను చేసిన ట్వీట్లో పొరపాటును గమనించి వివరణ ఇచ్చినందుకు థాంక్స్. ఇందుకు నేను సారీ చెబుతూ ట్వీట్ ను డిలీట్ చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఏమైనా చిన్మయి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus