Chinmayi Sripada: సందీప్ రెడ్డి వంగా చెంపదెబ్బల కాంట్రోవర్సీ పై చిన్మయి వివరణ!

‘కబీర్ సింగ్’ రిలీజ్ టైంలో.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా  (Sandeep Reddy Vanga) బాలీవుడ్ మీడియాతో ముచ్చటిస్తూ.. అతని దృష్టిలో ‘పార్ట్నర్ పై ప్రేమ ఎక్కువగా ఉంది అనేది చెంపదెబ్బలు వల్లనే బయటపడుతుంది. ప్రేమ ఉంటేనే మనం పార్ట్నర్ పై చెయ్యి చేసుకుంటాం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలో హీరోయిన్ ని హీరో చెంపదెబ్బలు కొట్టిన సన్నివేశాలను ఉద్దేశిస్తూ సందీప్ చెప్పిన మాటలు ఇవి. అయితే వీటిని సింగర్ చిన్మయి (Chinmayi Sripada) , సమంత  (Samantha) వంటి వారు వ్యతిరేకించారు.

Chinmayi Sripada

దీంతో దేశవ్యాప్తంగా ఈ టాపిక్ సంచలనం సృష్టించింది. తాప్సి వంటి హీరోయిన్లు కూడా సందీప్ పై సెటైర్లు విసురుతూ కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే సందీప్ కామెంట్స్ పై తాజాగా చిన్మయి వివరణ ఇచ్చింది. అతను వ్యాఖ్యలు వ్యతిరేకించడానికి గల కారణాలు ఆమె చెప్పుకొచ్చింది. చిన్మయి మాట్లాడుతూ.. “సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన దానికి మేము కౌంటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఏ రకమైన చెంపదెబ్బలు గురించి చెప్పాడు అనేది వివరించలేదు.

‘చెంప దెబ్బలు కొడితే ప్రేమ ఎక్కువ ఉన్నట్లు’ అని ఆయన మాట్లాడారు. కానీ మా పర్సనల్ లైఫ్ ని ఆధారం చేసుకుని మేము మాట్లాడాము. మా దృష్టిలో వయొలెన్స్ అనేది ప్రేమకి నిర్వచనం కాదు. నా మ్యారీడ్ లైఫ్లో నా భర్త రాహుల్  (Rahul Ravindran)  ఇప్పటివరకు చెయ్యి చేసుకుంది లేదు. నేను కూడా అతనిపై విరుచుకుపడలేదు. నా పిల్లలను నేను కొట్టలేదు.

నేను ప్రేమగా పెంచుకుంటున్న నా కుక్కలపై ప్రేమ చూపించాలి అని కొడితే అవి వచ్చి కరుస్తాయి. అది ప్రేమ అనలేం కదా. నా భర్త ఎప్పుడూ చెబుతుంటాడు.. ‘అందరినీ ఈక్వల్ గా చూడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి.. అలాగే తిరిగి వాటిని పొందాలి అని..! ఆ ఉద్దేశంతో.. ఆ టోన్లో మేము స్పందించడం జరిగింది. అంతే తప్ప మరేమీ కాదు” అంటూ చెప్పుకొచ్చింది.

‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్ ప్లాన్ బాగుంది రాజుగారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus