చిన్నికృష్ణ పై కామెంట్స్ చేస్తున్నారు!

ప్ర‌ముఖ ర‌చ‌యిత చిన్ని కృష్ణ ఓ ప్ర‌ధాన ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. చిరంజీవికి ఓ క‌థ చెప్పాన‌ని, అది ఆయ‌న‌కు న‌చ్చ‌లేద‌ని.. చెప్పుకొచ్చిన చిన్ని కృష్ణ చిరంజీవి న‌టిస్తున్న క‌త్తి సినిమా కాపీ పేస్ట్‌లా ఉంటుంద‌ని, జిరాక్స్ కాపీయేన‌ని సెటైర్లు వేశారు. ”నేను ఇప్ప‌టి వ‌ర‌కూ రాసిన ఏ క‌థ‌నీ ప్రేక్ష‌కులు రిజ‌క్ట్ చేయ‌లేదు” అని కాస్త ఓవ‌ర్ కాన్పిడెన్స్‌తో మాట్లాడాడు చిన్ని కృష్ణ‌.

దాంతో చిరంజీవి అభిమానులు కూడా చిన్ని కృష్ణ పై సెటైర్లు వేయ‌డం మొద‌లెట్టారు. చిన్ని కృష్ణ గ‌తం మ‌ర్చిపోయాడేమో అంటూ కౌంట‌ర్లు వేస్తున్నారు. చిన్ని క‌థ అందించిన బ‌ద్రినాథ్ ఓ మాదిరిగా ఆడిందంతే. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జీనియ‌స్ అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. ఆ త‌ర‌వాత‌.. చిన్ని కృష్ణ చాలామందికి క‌థ‌లు చెప్పి ఒప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ.. అవేం ఓ కొలిక్కి రాలేదు. అందుకే.. ఇలా నిరాశ నిస్పృహ‌ల‌తో కామెంట్లు చేస్తున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus