Chiranjeevi: చిరంజీవి – వశిష్ట కూడా ఆ ట్రాప్‌లో పడుతున్నారా? సక్సెస్‌ అవుతారా?

ఓ భారీ కాన్వాస్‌ ఉన్న సినిమాను అనుకోవడం… కొన్ని రోజుల తర్వాత ఆ సినిమాను రెండు ముక్కలు చేయడం. సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చిన్న సినిమాలకు కాదు కానీ.. పెద్ద సినిమాలకు అయితే ఇదే ఫార్ములాను చిత్రబృందాలు పాటిస్తున్నాయి. అలా మరో స్టార్‌ హీరో సినిమా రెండు పార్టులుగా వస్తోంది అని చెబుతున్నారు. ఇటీవల కొబ్బరికాయ కొట్టుకున్న సినిమా గురించే ఇదంతా. ఒకవేళ ఆ సినిమా చిరంజీవి 156వ చిత్రం అని మీరు అనుకుంటే..

కచ్చితంగా కరెక్టే. ఎందుకంటే పేరు పెట్టని ఆ సినిమాను రెండు పార్టులు తెరకెక్కిస్తారు అంటూ ఓ టాక్‌ మొదలైంది. అందులో నిజానిజాలే తెలియదు కానీ.. సినిమా ప్లాట్‌ తెలిసినవాళ్లు మాత్రం రెండు పార్టులు చేయడం పక్కా అనేస్తున్నారు. అంతే చిరు కెరీర్‌లోనే రూ. 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రెండు పార్టులుగా తీస్తే మంచిది అనే మాట కూడా వినిపిస్తోంది. త్వరలో ఈ రెండు పార్టుల విషయంలో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా భూలోకం, పాతాళ లోకం, దేవ లోకం కలయికలో ఉంటుంది అని అంటున్నారు. ఈ మేరకు మూడు రకాల సెట్‌లు కూడా రూపొందిస్తారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో చిరంజీవితో మరో కీలక పాత్ర ఉంటుంది అంటున్నారు. ఆ పాత్రతోనే టైమ్‌ ట్రావెల్‌లో చిరంజీవి (Chiranjeevi) మూడు లోకాలకు వెళ్తాడట. ఆ పాత్ర ఎవరు, ఎందుకు మూడు లోకాలకు వెళ్లాల్సి వస్తుంది అనేది సినిమాలో మెయిన్‌ పాయింట్‌ అని చెబుతున్నారు.

అయితే ఇక్కడ ప్రశ్న ఆ రెండో పాత్ర ఎవరు అని. కొంతమంది అయితే ఆ పాత్ర ఓ చిన్న పాప అని చెబుతుండగా… మరికొందరేమో మరో యంగ్ హీరో ఉంటారు అని అంటున్నారు. అంతేకాదు మూడు లోకాలకు ముగ్గురు హీరోయిన్లు ఉంటారని కూడా ఓ టాక్‌ నడుస్తోంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus