దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకే నిండుదనం వచ్చింది : మెగాస్టార్ చిరంజీవి!

కళాతపస్వీ కె. విశ్వనాథ్ కు  ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, `నాకు విశ్వనాథ్ గారితో ఉన్న అనుబంధం నటుడు, దర్శకుడని కాకుండా కుటంబ పరంగాను మంచి  రిలేషన్ ఉంది. ఆయనకు  ఈ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతికి లోనవుతున్నా. అవార్డు రావాల్సిన సమయంలో వచ్చిందా?  లేదా అన్న దానిపై ఇప్పుడు మాటలు అనవసరం. ఈ అవార్డు ఆయన్ను ఎప్పుడో వరించాల్సింది.

కానీ కాస్త ఆలస్యమైన అవార్డు ఆయన్ను వరించడం సంతోషంగా ఉంది. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు గానీ, మేము మాత్రం చాలా గర్వంగా ఫీలవుతున్నాం. ఆయనకు అవార్డు రావడం తో ఆ అవార్డుకు నిండుదనం వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా శుభాబివందనాలు తెలుపుతున్నా. ఎప్పటికీ ఆయన ఆశీస్సులు కోరే మనిషినే..ఆయన చిరంజీవినే` అని అన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus