మెగాస్టార్ చిరంజీవి ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఆయన సంజయ్ దత్ ఆరోగ్యంపై స్పందించడం జరిగింది. నటుడు సంజయ్ దత్ కి క్యాన్సర్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా సంజయ్ తనకు ఆరోగ్యం దెబ్బతింది అని ధృవీకరించారు. ఐతే ఆయన క్యాన్సర్ సోకినట్లు బహిర్గతం చేయలేదు. ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళుతున్నట్లు, మీ ప్రేమాభినాలు నన్ను కాపాడతాయి, తిరిగి వస్తాను అని ట్వీట్ చేయడం జరిగింది. దీనితో సంజయ్ దత్ అసలు విషయం దాస్తున్నాడని చాలామంది భావిస్తున్నారు.
అలాగే ఆయన ట్వీట్ క్యాన్సర్ సోకిందన్న వార్తలకు బలం చేకూర్చినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా ఆయన ఆరోగ్యంపై ట్వీట్ చేయడం ఆసక్తి రేపుతోంది. సంజయ్ దత్ అనారోగ్యానికి గురయ్యారని విచారం వ్యక్తం చేసిన చిరంజీవి…జీవితంలో ఇలాంటివి ఎన్నో సమస్యలు చూశావ్, నువ్వు గొప్ప ఫైటర్ వి. కాబట్టి నీవు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తావు అని ఆశాభావం వ్యక్తం చేశారు.
చిరంజీవి సైతం తన ట్వీట్ లో సంజయ్ కి క్యాన్సర్ అనే మాట వాడకపోవడం విశేషం.1993 ముంబై పేలుళ్ల ఘటనలో నిందితుడిగా ఉన్న సంజయ్ ఏళ్ల తరబడి జైలు జీవితం అనుభవించారు. వ్యక్తిగత జీవితంలో కూడా సంజయ్ అనేక సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఓ దశలో డ్రగ్స్ కి బానిసై చావు అంచుల వరకూ వెళ్లారు. అందుకే చిరంజీవి సంజయ్ ని ఫైటర్ తో పోల్చారు.