Chiranjeevi: వైష్ణవిని స్టార్ హీరోయిన్ తో పోల్చిన మెగాస్టార్ చిరంజీవి..!

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ బేబీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్ మెగాస్టార్ చిరంజీవి అతిథిగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, హీరోయిన్ వైష్ణవి చైతన్య , నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయి రాజేష్, దర్శకుడు మారుతి తదితరులు పాల్గొన్నారు. మూవీ టీమ్ కు షీల్డ్స్ అందించి విశెస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. నేను బేబి సినిమా విజయోత్సవ సభకు వచ్చానా లేక నా సన్మాన సభకు వచ్చానా అర్థం కావడం లేదు.

నన్ను అభిమానిస్తూ, ప్రేమిస్తూ వాళ్ల మనసులో మాటను నాకు చెబుతున్న నా అభిమానులందరికీ నా ధన్యవాదాలు చెబుతున్నా. మారుతి, సాయిరాజేష్, ఎస్కేఎన్ వంటి నా ఫ్యాన్స్ కలిసి చేసిన సినిమా ఘన విజయం సాధించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. వాళ్ల సంతోషంలో నేనూ ఒక భాగమవ్వాలని ఈ కార్యక్రమానికి వచ్చాను. ఇండస్ట్రీలోకి కొత్త తరం రావాలి, కొత్త ఆలోచనలు కావాలి. అప్పుడే ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. రాజమౌళి లాంటి దర్శకులు ఉన్నారు కాబట్టే ఆస్కార్ వరకు తెలుసు సినిమాలు వెళ్లగలుగుతున్నాయి.

కొత్త దర్శకులు ఇండస్ట్రీ అభివృద్ధిలో భాగమైతే…అదే మీరు చేసే ప్రత్యుపకారం అనుకోవాలి. ఆనంద్ గతంలో చేసిన ఒక సినిమా చూశాను. ఇప్పుడు బేబి చూస్తుంటే నటుడిగా ఆనంద్ ఎంతో పరిణితి చెందాడని అనిపించింది. ఆనంద్ లో ఒక మంచి యాక్టర్ ఉన్నాడు. విరాజ్, అశ్విన్ చక్కగా నటించారు. వైష్ణవిని చూస్తుంటే నాకు చెమటలు పడుతున్నాయి ఏంటి? అని చిరంజీవి అన్నారు. వైష్ణవి మానసిక సంఘర్షణ ఆకట్టుకునేలా చూపించారు. ఆ స్ట్రగుల్ సినిమాను నిలబెట్టింది. బస్తీలో అమాయకపు అమ్మాయిగా కాలేజ్ లో ట్రెండీ మేకోవర్ లోకి మారే యువతిగా వైష్ణవి పర్మార్మెన్స్ ఆకట్టుకుంది.

సినిమా చూస్తున్నంత సేపూ చాలాసార్లు వైష్ణవి ఎంత మెచ్యూర్డ్ గా నటించింది అనిపించింది. సహజ నటి జయసుధకు ఉన్న లక్షణాలున్నాయని.. మంచి నటి అవుతుందని, గ్లామర్, డిగ్లామర్ పాత్రలో కూడా జయసుధ ఆకట్టుకునేవారు. అలాంటీ లక్షణాలు వైష్ణవిలో ఉన్నాయని అన్నారు. భవిష్యత్తులో మంచి ఎత్తుకు ఎదుగుతుందని (Chiranjeevi) అన్నారు. జీవితంలో తెలిసో తెలియకో ఒక తప్పుచేసినా బాధపడుతూ కూర్చోకుండా ఒక మంచి లైఫ్ ఉంటుందనే ఆశతో బతకాలనే గొప్ప సందేశాన్ని సాయిరాజేష్ ఈ సినిమాతో ఇచ్చాడన్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus