Acharya Release Date: ఆచార్య రిలీజ్ డేట్ లాక్ అయినట్టేనా?

2022 సంక్రాంతి పండుగకు పోటీ మామూలుగా లేదనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలైన భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ సినిమాలు 2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నాయి. ఆచార్య కూడా సంక్రాంతికే రిలీజ్ కావచ్చని వార్తలు వచ్చినా సంక్రాంతి పోటీకి ఆచార్య దాదాపుగా దూరమైనట్టే అని సమాచారం. గత రెండు రోజులుగా పుష్ప రిలీజ్ డేట్ మారనుందని వార్తలు వస్తున్నాయి. పుష్ప మేకర్స్ వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించకపోవడంతో చాలామంది ఆ వార్తలు నిజమేనని నమ్ముతున్నారు.

మరోవైపు ఆచార్య డిసెంబర్ 24వ తేదీన రిలీజ్ కానుందని సమాచారం. డిసెంబర్ 24వ తేదీలోపు ఏపీలో టికెట్ రేట్ల సమస్య పరిష్కారం అవుతుందని ఆచార్య మేకర్స్ భావిస్తున్నారు. ఎప్పుడు రిలీజైనా ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఊహించని స్థాయిలో ఉంటాయని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి, చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తున్న మూవీ కావడంతో ఆచార్య కొత్త రికార్డులు క్రియేట్ కావడం గ్యారంటీ అని మెగా ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు.

కొరటాల శివ వరుసగా నాలుగు సినిమాలతో విజయాలను సొంతం చేసుకోగా ఐదో సినిమా ఆచార్యతో సైతం మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటానని నమ్ముతున్నారు. సోలోగానే ఆచార్య రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆచార్య కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. రీఎంట్రీలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న చిరంజీవి ఆచార్య మూవీ సక్సెస్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus