Pawan Kalyan: తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చిరు.. అద్భుతాలు జరగాలంటూ?

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు కావడంతో ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ అభిమానులు బర్త్ డే వేడుకలను ఒకింత గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వస్తుందని అయితే ఈ పుట్టినరోజు మరింత స్పెషల్ అని చిరంజీవి అన్నారు.

Pawan Kalyan

ఏపీ ప్రజలకు అవసరమైన సమయంలో కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకొనిరావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడని చిరంజీవి చెప్పుకొచ్చారు. రాజకీయాలలో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన నాయకుడిగా పవన్ ను ప్రజలు వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారని గుండెల్లో స్థానం ఇచ్చారని అది సుస్థిరం అని చిరంజీవి కామెంట్లు చేశారు. ఈరోజుల్లో పవన్ లాంటి నాయకుడు రావాలని కావాలని మెగాస్టార్ అభిప్రాయపడ్డారు.

ఏపీలో అద్భుతాలు జరగాలని అది పవన్ మాత్రమే చేయగలడని చిరంజీవి (Allu Arjun) పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చేస్తాడనే నమ్మకం నాతో పాటు ఏపీ ప్రజలకు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్ భవ అంటూ చిరంజీవి కామెంట్లు చేశారు. చిరంజీవి చేసిన పోస్ట్ మెగా ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. పలువురు సెలబ్రిటీలు సైతం పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సైతం సోషల్ మీడియా వేదికగా పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు” అని బన్నీ తన పోస్ట్ లో పేర్కొన్నారు. మరోవైపు పవన్ పుట్టినరోజు కానుకగా సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో తెలియాల్సి ఉంది. చిరు, పవన్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో సినిమా కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

‘సరిపోదా శనివారం’ 4 రోజుల కలెక్షన్స్.. ఎలా ఉన్నాయంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus