మోహన్ బాబు, చిరు మధ్య చిగురించనున్న స్నేహం

మెగాస్టర్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. ఇద్దరూ స్వశక్తితో చిత్రపరిశ్రమలో నిలదొక్కుకున్నవారు. వీరు కెరీర్ మొదలు నుంచి మంచి స్నేహితులు. టాలీవుడ్ పండ‌గ వజ్రోత్సవాల వేళ చిరుపై మోహన్ బాబు విరుచుకు పడ్డారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటలు దూరమయ్యాయి. మళ్లీ వీరి స్నేహం చిగురించనుంది. మెగాస్టార్, డైలాగ్ కింగ్ ల మధ్య అనుబంధం మరింత బలపడే సందర్భం వచ్చింది.

మోహన్ బాబు నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని .. టి. సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలోని ‘లలిత కళా పరిషత్ కలక్షన్ కింగ్ కి ‘నవరస నట తిలకం’ పురస్కారాన్ని అందించనుంది. ఈ వేడుక వైజాగ్‌లోని మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 17వ తేదీన  ఘనంగా జరగనుంది. ఈ వేడుకకి దాసరి నారాయణరావు, నాగార్జున, విక్టరీ వెంకటేశ్ తో పాటు చిరంజీవి కూడా హాజరు కానున్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ షూటింగ్ లో చిరు బిజీగా ఉన్నప్పటికీ, మోహన్ బాబు కోసం ఆయన తీరిక చేసుకుంటున్నారని సమాచారం. అయితే వజ్రోత్సవాల వేళ చెదిరిన స్నేహం ఈ వేడుకతో కలవనుందన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus