Ayodhya Ram Mandir: అయోధ్య చేరుకున్న మెగా ఫ్యామిలీ!

హిందువుల కొన్ని దశాబ్దాల కల నేడు నెరవేరుతుంది అయోధ్య రామ మందిరంలో మరికొంత సమయానికి రాములవారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని కనులారా చూడడం కోసం పలువురు సెలబ్రిటీలకు ఆహ్వానం అందడంతో సెలబ్రిటీలందరూ కూడా అయోధ్య చేరుకున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి కుటుంబానికి కూడా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానం అందిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ చిరంజీవి సురేఖ వంటి వారందరూ కూడా అయోధ్య చేరుకున్నారు. అయోధ్య వెళ్లినటువంటి ఈయన అక్కడ అభిమానులను కలిశారు. రామ్ చరణ్ చిరంజీవిని చూడడం కోసం పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి రావడంతో చిరంజీవి చరణ్ ఇద్దరు కూడా అభిమానులను కలిశారు. ఇలా అభిమానులకు అభివాదం చేస్తూ వారితో కాసేపు మాట్లాడారు. ఈ విధంగా అభిమానులతో ఇద్దరు హీరోలు మాట్లాడటంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఆంజనేయ స్వామిని ఎంతగానో విశ్వసించే చిరంజీవికి రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం రావడంతో స్వయంగా శ్రీరాములవారి కృపతోనే తనకు ఈ అద్భుతమైన అవకాశం లభించిందనీ సంతోషం వ్యక్తం చేశారు. మరి కొన్ని గంటలలో రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే (Ayodhya Ram Mandir) అయోధ్యకు సెలబ్రిటీలు అందరూ కూడా చేరుకున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus