Chiranjeevi, Ravi Teja: చిరు, రవితేజ సవతి సోదరుల్లా కనిపిస్తారా?

  • July 27, 2022 / 11:38 AM IST

యాదృచ్ఛికమో, కథ డిమాండో తెలియదు కానీ.. చిరంజీవి వరుసగా ఇతర హీరోలతో జట్టు కడుతున్నారు అని ఇటీవల మనం అనుకున్నాం. ‘ఆచార్య’, ‘వాల్తేరు వీరయ్య’, ‘గాడ్‌ ఫాదర్‌’.. ఇలా వరుసగా ఇంకో హీరోతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు అని అనుకున్నాం. ‘ఆచార్య’లో చూడని, ‘గాడ్‌ఫాదర్‌’లో చూడలేకపోయే సన్నివేశాలు ‘వాల్తేరు వీరయ్య’ (సినిమా పేరు అధికారికంగా ప్రకటించలేదు) సినిమాలో చూస్తామా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. టాలీవుడ్‌ లేటెస్ట్‌ బజ్‌లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఫేస్‌ ఆఫ్‌ అనే ముచ్చట్లే వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో చిరంజీవితోపాటు రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే రవితేజ ఈ సినిమా సెట్‌లో అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. దాంతోపాటు ఇద్దరి మధ్య ఓ పాట కూడా ఉంటుంది అంటున్నారు. అలా ఆ సన్నివేశాలు ఫేస్‌ ఆఫ్‌లా ఉంటాయి అని చెబుతున్నారు. టాలీవుడ్‌ వర్గాల సమాచారం ఈ సినిమాలో చిరంజీవి — రవితేజ అన్నదమ్ముల్లా కనిపిస్తారట. అయితే సవతి సోదరులు అని తెలుస్తోంది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఫేస్‌ ఆఫ్‌ సీన్లు ఉంటాయి అని అంటున్నారు. అయితే ఇద్దరి మధ్య చక్కటి అనుబంధం చూపిస్తూనే, ఆఖరున ఈ ఫేస్‌ ఆఫ్‌ చూడొచ్చు అంటున్నారు. మరోవైపు అలాంటిదేం ఉండదని, ఫ్లాష్‌ బ్యాక్‌లో రవితేజ పాత్ర వస్తుందని ఇంకొందరు చెబుతున్నారు. ఈ సినిమా అంతా విశాఖపట్నం – సముద్రం నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఇప్పటివరకు విడుదల చేసిన సినిమాకు సంబధించిన ప్రచారం కంటెంట్‌లో సముద్రం, చిరంజీవి మాస్‌ గెటప్‌నే ప్రధానంగా చూపించారు.

ఈ సినిమాలో చిరంజీవి అండర్‌ కాప్‌ పోలీసుగా నటిస్తున్నాడని కూడా వార్తలొస్తున్నాయి. ఫ్లాష్‌ బ్యాక్‌లో రవితేజ పోలీసు అధికారిగా కనిపిస్తారని కూడా అంటున్నారు. ఇందులో ఏది నిజం, ఏది పుకారు అనేది తేలాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. ఎందుకంటే వీరయ్య అప్పుడే వస్తున్నాడు. సో సంక్రాంతికి వీరయ్య సందడి చూడొచ్చు. అప్పటివరకు ఈ పుకార్లు షికార్లు కొనసాగుతాయి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus