మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవితో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోని ఆల్‌టైం హిట్ మూవీస్‌లో ఖచ్చితంగా వుండే చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు సెల్యూలాయిడ్‌పై ఆవిష్కరించిన ఈ అద్భుత దృశ్యకావ్యం.. ఎన్నేళ్లయినా ప్రేక్షకులను అలరిస్తూనే వుంది. 1990 మే 9న విడుదలైన ఈ సినిమా .. వచ్చే నెలతో 32 వసంతాలను పూర్తి చేసుకోనుంది. చిరంజీవి నటన, శ్రీదేవి అందాలు, మైమరపించే సంగీతం ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి.
తెలుగు చిత్ర సీమలో ఎన్నో సినిమాలు ఘన విజయం సాధించాయి.కానీ జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి హిట్ మాత్రం అరుదనే చెప్పాలి. చందమామ కథలాంటి సినిమాను ఎవరు చూస్తారంటూ దెబ్బిపోడుపులు, అకాల వర్షాలతో ఆంధ్రదేశం విలవిలలాడుతున్నా.. ఈ సినిమా ఘన విజయం సాధించింది. థియేటర్లలో మోకాళ్ల లోతు నీళ్లలోనే సినిమాను వీక్షించారు ప్రజలు. అన్న ఎన్టీఆర్ సైతం ఓ రోడ్‌షోలో భయపడకండి.. అంతా సవ్యంగానే జరుగుతుందని అశ్వినీదత్, రాఘవేంద్రరాలకు ధైర్యం చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే వసూళ్ల వాన కురిసింది.
అయితే ఈ అద్భుత దృశ్యం కావ్యం వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగున్నాయి. ఇందులో ఒకటి రెమ్యూనరేషన్. టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా వెలిగిపోతున్న చిరంజీవితో సమానంగా శ్రీదేవికి పారితోషికం ఇచ్చారట అశ్వినీదత్. అప్పటికే మెగాస్టార్ దక్షిణాదిలోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా వున్నారు. శ్రీదేవి తెలుగు, తమిళంతో పాటు హిందీలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్నారు. దీంతో చిరంజీవికి రూ.35 లక్షలు, శ్రీదేవికి రూ.25 లక్షలు ఇచ్చారు నిర్మాతలు.ఇక మొత్తంగా 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన జగదేకవీరుడు అతిలోకసుందరి .. రూ.15 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఇప్పటి లెక్క ప్రకారం.. అది బాహుబలితో సమానమని ట్రేడ్ వర్గాల అంచనా. ఇది నిర్మాత అశ్వనీదత్‌కు చక్రవర్తి అనే రచయత చెప్పిన స్టోరీ లైన్. దీని ఆధారంగా సినిమా కథను జంధ్యాల తనదైన స్టైల్‌లో రెడీ చేయడంతో పాటు మాటలు కూడా ఆయనే రాశారు. హిందీలోఈ చిత్రాన్ని ‘ఆద్మీ ఔర్ అప్సర’గా డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు పలు ఇతర భాషల్లో కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!