మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) – అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ అయిందని దర్శకుడు అనిల్ స్వయంగా ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్‌లో హైపేంటో చెప్పక్కర్లేదు. చిరంజీవికి కథ వినిపించిన అనిల్, ఆయన నుండి వెంటనే గ్రీన్ సిగ్నల్ రాబట్టడం విశేషంగా మారింది. అంతే కాకుండా ఈ సినిమాలో చిరు పాత్ర పేరు ‘శంకర వరప్రసాద్’ అనే చెప్పి ఫ్యాన్స్‌ను ఊరేశాడు. చిరంజీవి గారికి నా కథలో పాత్ర “శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను.
ఆయన దాన్ని చాలా బాగా లైక్ చేశారు. ఇంకెందుకు లేటు. త్వరలో ముహూర్తంతో చిరు నవ్వుల పండగబొమ్మ కి శ్రీకారం..” అంటూ అనిల్ ట్వీట్ చేశారు. ఇది చిరు అసలు పేరు కావడంతో, సినిమాలో ఆయన క్యారెక్టర్‌కు బలమైన ఎమోషనల్ అటాచ్ ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ‘శంకర్ దాదా MBBS’లో (Shankar Dada M.B.B.S) కూడా ఇదే పేరును ఉపయోగించి మెగా అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారు.
ఈసారి అనిల్ మార్క్ హ్యూమర్, చిరు ఎనర్జీ కలిస్తే థియేటర్లలో పండగే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సంగీత దర్శకుడిగా ఎంపికై, నాలుగు పాటల వర్క్ పూర్తయినట్టు టాక్. మే నుండి షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తుండగా, ఉగాది రోజే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రీ-ప్రొడక్షన్ పనులు సవ్యంగా సాగుతున్నాయని సమాచారం.
విశ్వంభర (Vishwambhara) సినిమా విడుదలైన వెంటనే చిరు పూర్తిగా ఈ ప్రాజెక్ట్ మీదే ఫోకస్ పెట్టనున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. తక్కువ టైమ్‌లో సినిమాను కంప్లీట్ చేయాలని అనిల్ భావిస్తున్నాడని తెలుస్తోంది. మాస్, ఫన్ మిక్స్‌తో ఈ సినిమా మెగా అభిమానులకు పండుగలా ఉండబోతోంది.