మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుల కోసం ఎప్పటికప్పుడు తనదైన శైలిలో సహాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటూ ఉన్నారు. గత కొద్దిరోజుల క్రితం ఈయన క్యాన్సర్ పరీక్షల గురించి మాట్లాడుతూ సినీ కార్మికులందరికీ ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయిస్తామని ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లోస్టార్ హాస్పిటల్ సంయుక్త ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సినీ కార్మికుల పట్ల గొప్ప మనసు చాటుకున్నారు.
రోజుకు 1000 మంది సినీ కార్మికులకు అలాగే మెగా అభిమానులకు ఉచితంగా అన్ని రకాల క్యాన్సర్ పరీక్షలు చేయిస్తామని చిరంజీవి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ బృహతరమైన కార్యానికి జూలై 9వ తేదీ శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించారు. ఇలా భవిష్యత్తులో ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడం కోసమే ఇలా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈయన తెలిపారు.
చిరంజీవి (Chiranjeevi) ఛారిటబుల్ ట్రస్ట్, స్టార్ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని మెగాస్టార్ తెలియజేశారు. జులై 9 హైదరాబాద్, జులై 16 విశాఖపట్నం, 23 కరీంనగర్ లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించబోతున్నట్లు తెలియజేశారు. రోజుకు 1000 మందికి చొప్పున ఈ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. మరొక రెండు మూడు రోజులలో సినీ కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి ఈ విషయం గురించి చర్చలు జరుపుతామని తెలిపారు.
అలాగే సినీ కార్మికుల కోసం ప్రత్యేకంగా కార్డులు కూడా జారీ చేస్తామని ఈ సందర్భంగా చిరంజీవి వెల్లడించారు. ఇలా అభిమానుల కోసం సినీ కార్మికుల కోసం ఈయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే ఈయన భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!