టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గాడ్ ఫాదర్ తో సక్సెస్ ను సొంతం చేసుకున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు. అయితే ఇతర టాలీవుడ్ స్టార్ హీరోలు ఓటీటీ ఎంట్రీ విషయంలో ఆసక్తి చూపిస్తుండగా చిరంజీవి మాత్రం ఓటీటీ ఎంట్రీపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కొన్నేళ్ల క్రితం చిరంజీవి స్టార్ మా ఛానల్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు
షోకు హోస్ట్ గా వ్యవహరించగా ఈ షో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో భాగంగా ఓటీటీ ఎంట్రీ గురించి చిరంజీవి మాట్లాడుతూ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కామెంట్లు చేశారు. మంచి కథ దొరికితే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తానని ఆయన చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ సమయంలో ఓటీటీ ప్రాజెక్ట్ లకు నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆయన కామెంట్లు చేశారు.
మరోవైపు శని, ఆదివారాలలో గాడ్ ఫాదర్ మూవీ భారీగానే కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వీకెండ్ రిజల్ట్ ను బట్టి కమర్షియల్ గా గాడ్ ఫాదర్ మూవీ రిజల్ట్ గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. గాడ్ ఫాదర్ సినిమాకు చిరంజీవి 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.
పరిమిత బడ్జెట్ లోనే ఈ సినిమా తెరకక్కడంతో సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో వచ్చినా ఈ సినిమాకు నష్టాలు వచ్చే అవకాశాలు అయితే తక్కువేనని తెలుస్తోంది. గాడ్ ఫాదర్ సినిమా నిర్మాతలలో చరణ్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ చిరంజీవి ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!