Chiranjeevi: చిరంజీవి కావాలని అనకపోయినా వివాదం మొదలైందా?

వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్ హనుమకొండలో గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ చేసిన కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమాలోని ఒక సీన్ లో నేను చిన్న హీరోకు ముద్దు పెట్టానని అన్నారని చిరంజీవి సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. రవితేజ చిన్న హీరో అని చిరంజీవి కామెంట్లు చేయడం గమనార్హం.
వాస్తవానికి రవితేజకు చాలామంది స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ ఉంది.

రవితేజ నటించిన ధమాకా సినిమా 110 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ పాత్ర నిడివి తక్కువే అయినా ఈ సినిమా కోసం రవితేజ ఏకంగా 17 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారు. రవితేజ ఏ విధంగా చిన్న హీరో అవుతాడని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి నోరు జారాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించగా ఈ కలెక్షన్లలో రవితేజకు కూడా వాటా ఉంది.

చిరంజీవి కావాలని అనకపోయినా ఆయన కామెంట్ల గురించి వివాదం మొదలైంది. ఈ మధ్య కాలంలో కొంతమంది డైరెక్టర్లు సైతం రవితేజతో సినిమాలను తెరకెక్కించి రవితేజను చిన్న హీరో సంబోధించడం గమనార్హం. ఈ కామెంట్ల గురించి చిరంజీవి వివరణ ఇచ్చి వివాదం పెద్దది కాకుండా జాగ్రత్త పడితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి చేసిన కామెంట్ల గురించి రవితేజ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.

చిరంజీవి, రవితేజ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో చిరంజీవి, రవితేజ కలిసి నటిస్తారో లేదో చూడాల్సి ఉంది. వాల్తేరు వీరయ్య సక్సెస్ తో చిరంజీవి, రవితేజ మార్కెట్ భారీ స్థాయిలో పెరిగింది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus