Chiranjeevi: చిరంజీవి జీవితంలో అందమైన క్షణం ఇదే.. ఏం చెప్పారంటే?

  • November 27, 2023 / 04:45 PM IST

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా సంచలనం అవుతుంది. ఆ పోస్ట్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్, వ్యూస్ వస్తుండగా చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటోను పంచుకున్నారు. వరుణ్ లావణ్యల హల్దీ వేడుకకు సంబంధించిన ఈ ఫోటోలో చిరంజీవి దంపతులు సైతం సందడి చేశారు.

ఆ ఫోటో గురించి చిరంజీవి చెబుతూ ఇటలీలో ఒక అందమైన సాయంత్రం అని ఇది చాలా కాలం క్రితం జరిగింది కాదని ప్రేమతో ఒకటైన రెండు హృదయాలు ఎన్నో మధురమైన క్షణాలు, జ్ఞాపకాలను తీసుకొచ్చాయని అన్నారు. ఇలాంటి ఒక అందమైన క్షణాన్ని పంచుకుంటున్నానని చిరంజీవి వెల్లడించారు. చిరంజీవి చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి షేర్ చేసిన ఈ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ కు లక్షా 28 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వరుణ్ లావణ్య కలకాలం సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చిరంజీవి చేసిన పోస్ట్ కు ఫ్యాన్స్ తమదైన శైలిలో కమెంట్లు చేస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. చిరంజీవి విశ్వంభర సినిమాతో పాటు అనిల్ రావిపూడి సినిమాతో కూడా బిజీగా ఉన్నారు.

ఈ రెండు సినిమాలు క్రేజీ ప్రాజెక్ట్ లు కాగా ఈ సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి రెమ్యునరేషన్ 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. భోళా శంకర్ ఫ్లాపైనా చిరంజీవిపై ఆ సినిమా ప్రభావం పెద్దగా పడలేదనే చెప్పాలి. చిరంజీవి (Chiranjeevi) భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయో చూడాలి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus