Chiranjeevi: చిరంజీవి ఈ స్థాయికి రావడానికి అదే కారణమా?

  • August 22, 2022 / 04:24 PM IST

మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్నారనే సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా వెబ్ సైట్ ఉన్న తొలి భారతీయ నటుడు చిరంజీవి కావడం గమనార్హం. సినీ రంగంలో ఆస్కార్ అవార్డ్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. 1987 సంవత్సరంలో జరిగిన ఆస్కార్ అవార్డ్ ప్రధానోత్సవ వేడుకలకు చిరంజీవి హాజరయ్యారు. 1999 – 2000 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మొత్తంలో పన్ను చెల్లించిన వ్యక్తి చిరంజీవి కావడం గమనార్హం. అత్యధిక పన్ను చెల్లించడంతో చిరంజీవి సమ్మాన్ అనే అవార్డును పొందారు.

కెరీర్ తొలినాళ్లలో సుప్రీం హీరోగా పేరును సంపాదించుకున్న చిరంజీవి తర్వాత కాలంలో మెగాస్టార్ గా మారారు. ఒక సందర్భంలో చిరంజీవి నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే తనకు అస్సలు నచ్చవని చెప్పుకొచ్చారు. అలాంటి చోట నేను ఉండలేనని కామెంట్ చేశారు. లైఫ్ లో ఏదో సాధించాలని చెన్నైకు వెళ్లి ఏమీ సాధించలేక నిరుత్సాహంతో పాండీ బజార్ లో చాలామంది ఉండేవాళ్లని చిరంజీవి అన్నారు. పాండీ బజార్ వైపు వెళ్లడానికి కూడా నేను సాహసించలేదని ఫెయిల్యూర్ స్టోరీస్ ను వినడం వల్ల మనం శక్తిని కోల్పోతామేమోనని నాకు అనిపించిందని చిరంజీవి తెలిపారు.

నా మనసులో స్టార్ అవుతానని మంచి స్థాయికి చేరుకుంటానని ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. అప్పట్లో పెద్దపెద్ద లక్ష్యాలు ఉండేవి కావని నటుడిగా సుదీర్ఘ ప్రయాణం చేస్తానని ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. అభిమానులే నాకు స్పూర్తి అని అభిమానుల కోసం ఎంతైనా కష్టపడాలని అనిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

పసివాడి ప్రాణంలో బ్రేక్ డ్యాన్స్ చేశానని బావగారు బాగున్నారా సినిమాలో బంగీ జంప్ చేశానని ఆయన తెలిపారు. దానిని చూసి ప్రేక్షకులు ఆనందించిన సమయంలో నా కష్టాన్ని మరిచిపోయానని చిరంజీవి చెప్పుకొచ్చారు. వెంకన్నబాబు అనే మేనేజర్ వల్ల డ్యాన్స్ ల విషయంలో నేను మారానని చిరంజీవి అన్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus