సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ అంటే ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలింగ్, మీమ్సే. అంటే సోషల్ మీడియాలో ఒకరి హీరోను మరొకరు తిట్టడం, అభ్యంతరకరంగా ఎడిట్ చేసిన ఫొటోలు షేర్ చేయడం, వ్యక్తిగత అంశాలను గురించి చర్చ పెట్టడం. కానీ ఒకప్పుడు ఇది ఇలా ఉండేది కాదు. అయితే అప్పుడు ఫిజికల్ అయిపోయేది. అంటే కొట్టుకోవడాలు వరకు వెళ్లేది. ఈ క్రమంలో చాలామంది హీరోలు ‘మేమంతా ఒకటే.. మీరెందుకు కొట్టుకుంటున్నారు’ అంటూ అనేవారు కూడా. నాటి రోజుల గురించి చిరంజీవి మాట్లాడారు.
ప్రఖ్యాత అలయ్ బలయ్ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలో స్నేహం గురించి, అభిమానుల అతి గురించి కూడా సుతిమెత్తగా చురకలు అంటించారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో అభిమానుల పరిస్థితి ఏమంత బాగుండేది కాదని, సినిమాలు విడుదలవుతున్నాయంటే పోస్టర్లు చింపడాలు, అశుద్ధాలు రాయడం లాంటివి చేసేవారని, అది తనకు ఏమాత్రం నచ్చలేదని చెప్పారు. దాంతో హీరోల మధ్య స్నేహభాం ప్రేక్షకులకు కనిపిస్తే.. అభిమానుల్లో హేయభావం తగ్గుతుందని ఆయన భావించారట.
అందుకే ఆ రోజుల్లో తన సినిమా ఏదైనా హిట్ అయితే.. అప్పటి తోటి హీరోలు, తమిళ హీరోలను పిలిచి పార్టీలు ఇచ్చేవాడినని, అందరూ వచ్చి కాసేపు మాట్లాడుకుని సరదాగా గడిపేవాళ్లమని చెప్పారు. ఆ తర్వాత అభిమానుల్లో మార్పు వచ్చిందని చెప్పారు. అలా ఇండస్ట్రీలోకి పార్టీ కల్చర్‌ను తీసుకొచ్చింది తానే అని చెప్పాడు చిరంజీవి. అలాంటి కార్యక్రమాల వల్ల చాలా మార్పు కనిపించింది అని కూడా చెప్పాడు చిరంజీవి. అలా అందరూ స్నేహభావంతో ఉండాలనేది తన ఆలోచన అని కూడా చిరంజీవి చెప్పాడు.
చిరంజీవి అడుగుజాడల్లో ఇప్పుడు కూడా కొంతమంది హీరోలు పార్టీలు ఇస్తున్నారు. తమ సినిమా అనే కాదు, ఇతర హీరోల సినిమాలు బాగున్నప్పుడు కూడా పార్టీలు ఇస్తున్నారు. వారిని స్వయంగా అభినందిస్తున్నారు. ఆ విషయం మీడియాకు చెప్పి అభిమానుల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. అయితే ఇంత చేస్తున్నా ఇప్పటి అభిమానుల్లో మార్పు రావడం లేదు. దీంతో సమస్య ఎక్కడుందో అభిమానులు, హీరోలు ఆలోచించుకోవాలి.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!