Chiranjeevi: ‘ఠాగూర్’ కి మురుగదాస్ ను తప్పించడానికి కారణం అదే: చిరంజీవి

  • October 15, 2022 / 11:59 AM IST

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించారు. అయితే అన్నిటిలోకి బెస్ట్ అంటే ‘ఠాగూర్’ రీమేక్ అనే చెప్పాలి. ఇది తమిళ సినిమా ‘రమణ’ కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒరిజినల్ చూసిన వారికి కూడా రీమేక్ చూస్తున్నామన్న ఫీలింగ్ కలుగదు. దర్శకుడు వి.వి.వినాయక్ ‘ఠాగూర్’ ను అంత చక్కగా తీర్చిదిద్దాడు. ఇది పక్కన పెడితే.. చిరు ఓ సినిమాని రీమేక్ చేస్తున్నారు అంటే..

ఒరిజినల్ తో పోలిస్తే చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఆయన అభిమానులకు అలాగే మాస్ అభిమానులకు నచ్చే విధంగా మార్పులు చేయించుకుని కానీ ఆయన ఆ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకువెళ్ళరు. ‘గాడ్ ఫాదర్’ రీమేక్ కు మొదట సుజిత్ దర్శకుడు అని అనౌన్స్ చేశారు. తర్వాత సుకుమార్, వినాయక్ ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్ గా మోహన్ రాజా ఈ రీమేక్ ను తెరకెక్కించాడు.

గతంలోకి వెళితే.. ‘రమణ’ రీమేక్ బాధ్యతలు కూడా మురుగదాస్ కే అప్పగించాలి అని చిరు అనుకున్నారట. కానీ చేయలేదు. ఈ విషయం పై చిరు మాట్లాడుతూ.. “ర‌మ‌ణ రీమేక్ బాధ్య‌త‌ల్ని మొదట మురుగ‌దాస్ కే అప్ప‌గిద్దాం అనుకొన్నాను. కానీ… ఆయన మార్పులకు అంగీకరించలేదు.ర‌మ‌ణ క‌థ చాలా ‘రా’గా ఉంటుంది. పాట‌లు ఉండ‌వు. హీరో చివ‌ర్లో చచ్చిపోతాడు. తెలుగులో తీసిన‌ప్పుడు నేనూ చ‌చ్చిపోతే… నిర్మాతా చ‌చ్చిపోతాడు (న‌వ్వుతూ).కాబట్టి నా పై అలాంటి క్లైమాక్స్ చూడ‌లేరు.

అందుకే… హీరోని బ‌తికిద్దాం అని ముర‌గ‌దాస్ తో చెప్పాను. కానీ తను ఒప్పుకోలేదు. ‘నా హీరో త్యాగ‌శీలి.. త‌ను చ‌చ్చిపోతేనే ఆ క్యారెక్ట‌ర్ నిల‌బ‌డుతుంది’ అన్నాడు. పాట‌లు కూడా వ‌ద్ద‌న్నాడు. అప్ప‌టికి నేను అలాంటి ప్ర‌యోగం చేసే స్థితిలో లేను. అందుకే… వినాయ‌క్ తో చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus