చిరంజీవి రీసెంట్ టైమ్స్‌లో పాలిటిక్స్ గురించి ఇటీవల కాలంలో ఎక్కడా పెద్దగా మాట్లాడింది లేదు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలావరకు ఈ మాటలు ఆపేశాడు. మరోవైపు ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌లో బిజీ అయిపోతున్నాడు. ఆ మాటకొస్తే చిరంజీవి సినిమా పరిశ్రమలో కూడా ‘పెద్దన్న’ పాత్రకు కావాలనే దూరమైపోయారు. కానీ ఏమైందో ఏమో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడారు. దీంతో ఇప్పుడు ఆ కామెంట్స్ వైరల్‌గా మారాయి.
చిరంజీవి (Chiranjeevi) – రవితేజ – బాబి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఇటీవల 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్రంబృందం మరోమారు విజయోత్సవం జరుపుకుంది. అందులో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ సినిమా పరిశ్రమ గురించి, రాజకీయాల గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో పార్టీ, ప్రభుత్వం పేర్లు ఎత్తలేదు కానీ.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా పరిశ్రమ మీద పడతారేంటి అంటూ విరుచుకుపడ్డారు. అయితే ఇదంతా ఏపీ ప్రభుత్వం గురించే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
‘‘ఎంతసేపు చిత్ర పరిశ్రమ గురించి కాదు… మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి. రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు గురించి చర్చించాలి. పేదవారికి కడుపు నిండే విషయంలోనో, ఉద్యోగం – ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలోనో ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి’’ అని కాస్త సుతిమెత్తగా మీ పని మీరు చూసుకోండి అని చిరు సూచించాడు.
‘బ్రో’ సినిమా విషయంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేస్తున్న కామెంట్స్ నేపథ్యంలోనే చిరు ఈ మాట అన్నారు అని కొందరు అంటుంటే… గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసిన విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు, చిరంజీవికి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు చిరు కామెంట్స్ ఎలాంటి పరిస్థితుల్ని, కామెంట్స్‌ను తీసుకొస్తాయో చూడాలి. ఏపీ మంత్రుల రియాక్షన్ ఎలా మారుతుందో, దానికి చిరు సైడ్ నుండి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.
మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి
అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి – @KChiruTweets pic.twitter.com/XjJOodQLbP
— (@Gowtham__JSP) August 7, 2023
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!