Chiranjeevi, Venkatesh: వెంకటేశ్‌తో మల్టీస్టారర్‌ చేస్తా: చిరంజీవి కామెంట్స్‌ వైరల్‌!

  • December 28, 2023 / 11:42 AM IST

చిరంజీవి – వెంకటేశ్‌… వీరి స్నేహం ఇప్పటిది కాదు. 40 ఏళ్లుగా టాలీవుడ్‌లో మంచి ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నారు. ఇద్దరు అగ్ర స్టార్‌ హీరోల మధ్య ఈ తరహా స్నేహం ఉండటం అరుదు. ఆ స్నేహం ఎలాంటిదో మరోసారి కనిపించింది. ‘వెంకటేశ్‌ 75’ పేరుతో ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహించారు. వెంకటేశ్‌ కెరీర్‌లో 75వ సినిమా ‘సైంధవ్‌’ విడుదల సందర్భంగా ఈ ఈవెంట్ నిర్వహించారు. ఆ వేదిక మీద వెంకటేశ్‌ ఎర్లీ కెరీర్‌ గురించి చిరంజీవి ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఈ క్రమంలో వెంకటేశ్‌తో ఓ మల్టీస్టారర్‌ సినిమా చేయాలి అని అనుకుంటున్నానని, ఓ మంచి కథ సిద్ధం చేస్తే బాగుంటుంది అని చెప్పారు చిరంజీవి. ఇక నాటి రోజుల సంగతి చూస్తే… 1983లో సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో ‘సంఘర్షణ’ చేశా. అప్పుడు రామా నాయుడికి రెండో అబ్బాయి ఉన్నాడని తెలిసింది. ఎలా ఉంటాడు అని అడిగితే ‘ఫర్వాలేదు’ అని అన్నారు. కానీ కొన్నాళ్ల తర్వాత అందంగా మెరిసిపోతున్న వెంకటేశ్‌ను చూశాను. అప్పుడు నాలో గుబులు మొదలైంది అని అన్నారు చిరు.

అయితే వెంకటేశ్‌కి సినిమాలపై ఆసక్తి లేదు అని రామానాయుడు చెప్పాక ఊపిరి పీల్చుకున్నాను. అయితే అక్కడికి రెండేళ్లకు వెంకటేశ్‌ తిరిగొచ్చి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి మిత్రులుగా ముందుకెళ్తున్నాం. మేం కలిసి సినిమా చేయాలనేది తన కోరికా నా కోరికా కూడా. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది అని చెప్పారు చిరు. మరి ఈ తరహా కథ ఎవరు సిద్ధం చేస్తారో చూడాలి. గతంలో కూడా ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

వెంకటేశ్‌ (Venkatesh) తన సినిమా కెరీర్‌నే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని కూడా అందంగా నిర్మించుకున్నాడు. సురేశ్‌ బాబు లాంటి అన్నయ్య ఉండటంతోనే ఇదంతా సాధ్యమైందని అనుకుంటూ ఉంటాను. నాకు తెలిసి సంపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం వెంకటేశ్‌ అని కొనియాడారు చిరంజీవి. ఆ మాటలు, ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటోలు చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus