Chiranjeevi: ఈ వయసులో ఆ గ్రేస్ ఏంటీ బాసూ.. చిరు డ్యాన్స్ పై నెటిజన్స్ కామెంట్స్!

  • November 15, 2023 / 08:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి మరొక రెండు సంవత్సరాలలో 7 పదుల వయసులోకి అడుగు పెడతారు. ఇలా ఏడుపదుల వయసుకు దగ్గర పడుతున్నప్పటికీ ఈయన మాత్రం ఎంతో హుషారుగా యంగ్ హీరోలకు పోటీ పడుతూ సినిమాలలో నటిస్తున్నారు. అయితే ఈయన నటించిన సినిమాలు కొన్ని ప్రేక్షకులను మెప్పించ లేకపోయినా తాజాగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మాత్రం హైలెట్ అయింది.
చిరంజీవి ఎంతో అనుభవం టాలెంట్ కలిగినటువంటి నటుడు ఆయనని సరిగా ఉపయోగిస్తే మరోసారి వెండితెరపై అద్భుతమైన సినిమాలు వస్తాయి

అనడంలో సందేహం లేదు కానీ కొంతమంది డైరెక్టర్లు చిరు టాలెంటును ఉపయోగించుకోలేకపోతున్నారని ఆయన సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. ఇక చిరంజీవి నటనకు మాత్రమే కాకుండా ఆయన డాన్స్ కి కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. చిరంజీవి డాన్స్ వేస్తే కల్లార్పకుండా చూస్తారు. కానీ ఈ మధ్యకాలంలో చిరంజీవి ప్రతి సినిమాలోనూ చాలా సింపుల్ రొటీన్ స్టెప్స్ వేస్తూ రావడంతో ప్రేక్షకులకు ఈయన డాన్స్ పెద్దగా ఎక్కలేదని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే చాలామంది ముందు మెగా ఫ్యామిలీ శేఖర్ మాస్టర్ ను దూరం పెడితే బాగుంటుంది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మెగా ఇంట్లో జరిగినటువంటి దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా రాపర్ రాజకుమారి సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా తనతో కలిసి మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి డాన్స్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. చాలా స్టైలిష్ సింపుల్ స్టెప్స్ తో మెగాస్టార్ (Chiranjeevi) మరోసారి తన డాన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వయసులో కూడా ఆ గ్రేస్ ఏంటి బాసు అంటుకొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం హాఫ్ స్క్రీన్ లో ఇంత అద్భుతంగా డాన్స్ చేసే మీరు ఆన్ స్క్రీన్ పై ఎందుకు మెప్పించలేకపోతున్నారు ముందు కొరియోగ్రాఫర్లను మార్చండి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus