చిరుకి….శ్రీజ షాక్!!!

టాలీవుడ్ లో టాప్ ఫ్యామిలీస్ లో మెగా ఫ్యామిలీ ఒకటి అనడంలో ఏమాత్రం సందేహం లేదు….సక్సెస్ పరంగా ఎలా ఉన్నా… హీరోల లెక్కల పరంగా మాత్రం మెగా ఫ్యామిలీనే టాప్ లిస్ట్ లో ఉంది. ఈ క్రమంలో మెగా గ్రేస్ ను ఉపయోగించుకుంటూ మరికొందరు మెగా ఫ్యానిలీ నుంచి టాలీవుడ్ లో చక్రం తిప్పేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తుంది. విషయంలోకి వెళితే….ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా హీరోయిన్ గా నిహారిక ఎంట్రీ ఇవ్వగా…చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా చిరంజేవి 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ కు పని చేస్తోంది. ఇక అదే క్రమంలో నేనేమైనా తక్కువ తిన్నానా అని అనుకుందో ఏమో గాని, చిరు చిన్న కూతురు సైతం నేను ఇండస్ట్రీలోకు వస్తా అంటుంది…హీరోయిన్ గా అనుకునేరు….అంత సీన్ లేదు…నిర్మాతగా….మారతాను అంటుంది.

విషయం ఏమిటంటే…అమెరికాకు చెందిన ఒక వ్యాపార వేత్తను ఈ మధ్యనే పెళ్ళి చేసుకున్న శ్రీజ విదేశాలలో మేనేజ్ మెంట్ స్టడీస్ కు సంబంధించిన ఉన్నత డిగ్రీని పొందిన విషయం తెలిసిందే. అయితే అదే క్రమంలో తాను సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా…శ్రీజ భర్తకు సినిమాల పట్ల ఉండే ఇష్టంతో అతడు కూడ హీరోగా మారతాడు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే మెగా హీరోల సంఖ్య పెరిగి పోవడంతో శ్రీజ భర్త ఇలా వ్యూహాత్మకంగా చిరంజీవి చిన్న  కూతురును ఇలా నిర్మాతగా మెగా కుటుంబ సహకారంతో మారుస్తున్నాడనుకోవాలి.  ఏది ఏమైనా….టాలీవుడ్ కు మరో మెగా ఎంట్రీ దొరికినట్లే…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus