Chiranjeevi: మెగాస్టార్ న్యూ ట్రిప్.. నెక్స్ట్ సినిమా కోసం అక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసా?

బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి మేనియా మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం థియేటర్లలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే, చిరు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పనులను మరింత వేగవంతం చేశారు. తన తర్వాతి సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని భావిస్తున్న మెగాస్టార్, అందుకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించారు.

Chiranjeevi

ఈ క్రమంలోనే చిరంజీవి ప్రస్తుతం దుబాయ్‌లో ల్యాండ్ అయ్యారు. అక్కడ తన తర్వాతి చిత్ర దర్శకుడు బాబీ కొల్లితో కలిసి స్క్రిప్ట్ చర్చల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేయాలని బాబీకి చిరు సూచించారని, అందుకే వీరు ప్రశాంతంగా కూర్చుని కథను ఫైనల్ చేసేందుకు దుబాయ్ వెళ్ళారని తెలుస్తోంది.

విశేషమేమిటంటే, ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను సీనియర్ రచయిత కోన వెంకట్ పర్యవేక్షిస్తున్నారు. బాబీ టీమ్ రాసుకున్న కథలో మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా మార్పులు చేస్తూ, ఎమోషన్స్ పక్కాగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ స్క్రిప్ట్ పనులన్నీ కంప్లీట్ అవ్వబోతున్నాయట. ఈసారి కథలో ఒక బలమైన కూతురి సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్.

స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన వెంటనే, ఫిబ్రవరిలో ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోయే ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. సినిమాలో ఒక ముఖ్యమైన గెస్ట్ రోల్ కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను సంప్రదించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కూతురి పాత్రలో ఒక యంగ్ హీరోయిన్ నటించబోతుండగా, ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దుబాయ్ నుంచి చిరు తిరిగొచ్చాక ఈ సినిమాపై ఒక అఫీషియల్ అప్‌డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus