Chiranjeevi: ‘విశ్వంభర’ కోసం చిరు కష్టాలు.. నిజంగా గ్రేట్..!

‘భోళా శంకర్’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)   నుండి ‘విశ్వంభర’ (Vishwambhara)  అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘బింబిసార’ (Bimbisara)  దర్శకుడు మల్లిడి వసిష్ఠ (Mallidi Vasishta) దీనికి దర్శకుడు. ఇదొక సోసియో ఫాంటసీ మూవీ. టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. అందులోని వీ.ఎఫ్.ఎక్స్ కి కొంత నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతికే రిలీజ్ అనుకున్నారు. కానీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  గురించి ఆ సినిమాను వాయిదా వేశారు. అలాగే మరోపక్క ‘విశ్వంభర’ వి.ఎఫ్.ఎక్స్ విషయంలో మరింత కేర్ తీసుకోవాలని టీం భావిస్తుంది.

Chiranjeevi

వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి ఈరోజు జపాన్ కి వెళ్లారు. ‘విశ్వంభర’ సినిమా షూటింగ్లో భాగంగా ఆయన జపాన్ వెళ్లినట్టు తెలుస్తుంది. అక్కడ ఓ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందట. 10 రోజుల పాటు అక్కడ ‘విశ్వంభర’ షూట్ జరుగుతుందని తెలుస్తుంది. అయితే చిరుకి ప్రస్తుతం ఒంట్లో బాలేదట. కొన్ని రోజుల నుండి ఆయన చికున్ గున్యా జ్వరంతో బాధపడుతూ వస్తున్నారు. మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళలో పోటు.. వంటి వాటితో చిరు ఇబ్బంది పడుతున్నారట.

కానీ షూటింగ్ డిలే అయ్యి నిర్మాతలు ఇబ్బంది పడకూడదు అని భావించి.. చిరు ‘విశ్వంభర’ షూట్లో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది.నిన్న ‘జీబ్రా’ (Zebra)  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా చాలా ఇబ్బంది పడుతూనే ఆయన వచ్చారని సమాచారం. సత్యదేవ్  (Satya Dev)  మాటను కాదనలేక చిరు వచ్చినట్టు ఇన్సైడ్ టాక్.

ఇక ‘విశ్వంభర’ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ నిర్మిస్తున్నారు. 2025 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు. మే 9 డేట్ కి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని టీం భావిస్తున్నట్టు సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus