టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 4 దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు చిరంజీవి నటుడిగా ఎదుగుతూనే మరోవైపు తన కష్టార్జితంలో కొంత మొత్తాన్ని సేవ కోసం ఖర్చు చేస్తున్నారు. బ్లడ్ బ్యాంకులు, ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయడంతో పాటు జర్నలిస్టులు, సినీ రంగానికి చెందిన వాళ్లు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో చిరంజీవి తన వంతు సాయం చేస్తున్నారు. అయితే చిరంజీవి చేస్తున్న సాయాన్ని ప్రముఖ టీవీ ఛానెళ్లు, పత్రికలు పట్టించుకోకపోవడం గురించి మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి సొంతంగా న్యూస్ ఛానెల్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ కోరికను మెగాస్టార్ తీరుస్తారో లేదో చూడాల్సి ఉంది. చిరంజీవి సహాయం చేస్తున్నా కొన్ని ఛానెళ్లు చిరంజీవికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. కేవలం ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు కోసం చిరంజీవి 30 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయడం గమనార్హం. అయితే చిన్న నటులు చేసిన సాయాలకు ప్రాధాన్యతనిస్తున్న మీడియా చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో కూడా మీడియా నుంచి సపోర్ట్ లభించలేదు. చిరంజీవి మంచి చేస్తున్నా కొన్ని ఛానెళ్లు చెడుగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో చిరంజీవి ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. చిరంజీవి ఛానెల్ పెడితే జనసేన పార్టీకి సైతం ప్రయోజనకరంగా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మెగాస్టార్ టీవీ ఛానల్ పెడతారో లేదో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. అయితే సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి టీవీ ఛానెల్ పెట్టడం జరిగే పని కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.