‘వినయ విధేయ రామా’ చిత్రానికి సంబంధించి మొన్నామధ్య దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత దానయ్యల మధ్య పెద్ద వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. దీనికి ముఖ్య కారణం రాంచరణ్… చిత్రం నిరాశపరచడం పట్ల అభిమానులకి ఓ లేక రాసాడు.. అందులో బోయపాటి శ్రీను ప్రస్తావన తేకుండా.. నిర్మాత దానయ్యను వెనకేసుకొచ్చాడు. అంతేకాదు బయ్యర్లకు ఐదు కోట్లు చొప్పున తిరిగి వెనక్కి ఇవ్వాలని నిర్మాతను, దర్శకుడిని కోరాడు. ఇందులో చరణ్, దానయ్య మొత్తం పది కోట్లు తిరిగి ఇవ్వడానికి రెడీ అయినప్పటికీ .. బోయపాటి మాత్రం దీనిని వ్యతిరేకించడంతో వివాదం మొదలయ్యింది. నిర్మాత దానయ్య, బోయపాటి ఒకరినొకరు తిట్టుకునే వరకూ ఈ విషయం వెళ్ళడం గమనార్హం.
ఈ విషయంలో చరణ్ ఇన్వాల్వయ్యి ఉండడంతో… చిరంజీవి, అల్లు అరవింద్ రంగంలోకి దిగి ఈ విషయాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారట. ఈ విషయంలో చిరు … చరణ్ కి ఓ రేంజ్ లో క్లాస్ పీకారని తెలుస్తుంది. సినిమా మార్కెట్ విషయాల్లో జోక్యం చేసుకోవడం వలనే ఇదంతా జరిగిందని… అదే దానయ్య మార్కెట్ చేసుకొని ఉంటే మొత్తం తానే చూసుకునేవాడని చిరు ఫైర్ అయ్యారట. ఇలా సినిమా ప్లాప్ అయిన ప్రతీసారి డబ్బులు ఇచ్చుకుంటూ పోతే చాలా కష్టమని… చరణ్ కి చిరు సున్నితంగా చెప్పాడట. అలాగే ‘సైరా’ షూటింగ్లో బిజీగా ఉండగా తనకు ఒక్కమాట కూడా చెప్పకుండా ఇలా చరణ్ లెటర్ పోస్ట్ చేయడం పట్ల అసహనంగా ఉన్నారట చిరు. ఇదిలా ఉండగా.. బోయపాటితో ఎలాగైనా డబ్బులు కట్టించాలనేది రెండో విషయం. ఈ బాధ్యతలు చిరు.. అల్లు అరవింద్ కి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ కు.. బోయపాటికి మంచి అనుబంధం ఉంది. గతంలో వీరి కాంబినేషన్లో ‘సరైనోడు’ చిత్రం వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో అల్లు అరవింద్ మాట మీద బోయపాటి కూడా కాంప్రమైజ్ అయినట్టు తెలుస్తుంది.