మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఇష్టపడి లూసిఫర్ రీమేక్ హక్కులు దక్కించుకున్నారు. మోహన్ లాల్ నటించిన ఆ మలయాళ పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామా మంచి విజయం అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంశలు అందుకుంది. దానితో చిరు త్వరపడి ఆ మూవీ హక్కులు కొన్నారు. ఇక ఈ స్క్రిప్ట్ కి చిరు ఇమేజ్ మరియు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు సుజీత్ మార్పులు చేస్తున్నాడు. ఐతే ఇటీవల చిరుని కలిసి సుజీత్ స్క్రిప్ట్ వినిపించగా ఆయన సంతృప్తి పడలేదని వార్తలు రావడం జరిగింది.
అలాగే లూసిఫర్ ఒరిజినల్ మూవీలో ఉన్న కొన్ని పొలిటికల్ సన్నివేశాల పట్ల మెగాస్టార్ ఆలోచనలో ఉన్నారట. వాటి వలన కొత్త ఇబ్బందులు వస్తాయేమో అని చిరు సందేహ పడుతున్నాడని సమాచారం. దానికి తోడు మలయాళ ఫ్లేవర్ లేకుండా పూర్తిగా తెలుగు నేటివిటీలో ఈ మూవీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇక ఈ ప్రాజెక్ట్ ఆగిపోనుందని వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు.
లాక్ డౌన్ ముందు వరకు నిరవధిక షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ తిరిగి మొదలుకావడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తుంది. కరోనా వైరస్ కారణంగా చిరంజీవి ఆచార్య షూటింగ్ కి హాజరుకాలేని పరిస్థితి ఏర్పడింది. కమర్షియల్ అంశాలు కలిగిన సోషల్ సబ్జెక్టు తో ఈ మూవీ తెరకెక్కుతుండగా చరణ్ ఓ కీలక రోల్ చేయాల్సివుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా…మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Most Recommended Video
చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!