కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో ఆపదలో ఉన్న ఎంతోమందిని చిరంజీవి ఆదుకున్న సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి తను నటించిన లంకేశ్వరుడు సినిమాకు కో డైరెక్టర్ గా పని చేసిన ప్రభాకర్ కు సాయం చేశారు. ప్రభాకర్ కూతురు చదువుకు అవసరమైన డబ్బును చిరంజీవి అందించారు. మెగాస్టార్ చేసిన సాయం గురించి ప్రభాకర్ మాట్లాడుతూ కీలక విషయాలను చెప్పుకొచ్చారు. తాను దాసరి నారాయణరావు దగ్గర కో డైరెక్టర్ గా పని చేశానని హెల్ప్ లైన్ అనే సినిమాకు దర్శకనిర్మాతగా పని చేశానని ప్రభాకర్ తెలిపారు.
ఆ సినిమా రిలీజ్ కాకపోవడం వల్ల ఆర్థికంగా నష్టం వచ్చిందని ప్రభాకర్ అన్నారు. పాప బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతోందని రెండున్నర లక్షలు ఫీజు కడితే మాత్రమే ఎగ్జామ్ రాయగలదని ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ఎంత ప్రయత్నించినా డబ్బు దొరకకపోవడంతో చిరంజీవి గారిని సంప్రదించానని ప్రభాకర్ తెలిపారు. ఆర్థిక సాయం కోసం చిరంజీవిని కలవగా 30 సంవత్సరాల క్రితం లంకేశ్వరుడు సినిమాకు పని చేసిన సమయంలో ఎంత బాగా చూసుకున్నారో ఇప్పుడు కూడా అంతే ప్రేమగా చూసుకున్నారని ప్రభాకర్ చెప్పారు.
మహా విష్ణువులా చిరంజీవి తనను ఆదుకున్నారని రామ్ చరణ్ స్టాఫ్ కూడా తనకు సాయం చేశారని ప్రభాకర్ వెల్లడించారు. మెగాస్టార్ మంచి మనస్సును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ తెలియాల్సి ఉంది. చిరు, చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కొరకు ఎదురుచూస్తున్నారు.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!