మెగా హీరోలందరికీ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన చిరంజీవి..!

మెగా ఫ్యామిలీ నుండీ ఇప్పటికే 6 మంది హీరోలుగా చలామణీ అవుతున్నారు. ఈ తరుణంలో చిరంజీవి తన ఫ్యామిలీ హీరోల చిత్రాల పట్ల ఆచి తూచి అడుగేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుండీ వచ్చిన హీరోలందరూ ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకొని ముందుకు సాగుతున్నారు. బోల్డ్, అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రాలకు ఎక్కువ డిమాండ్ ఉన్న ఈ రోజుల్లో అలాంటి చిత్రాల్లో నటించి.. ఇండస్ట్రీలో ఉన్న ఆయన గౌరవాన్ని ఎంతమాత్రం డిస్టర్బ్ కాకుండా… తన హీరోలందరికీ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారంట మెగాస్టార్..!

తాజాగా మెగాస్టార్ మరో మేనల్లుడి సినిమా కూడా మొదలైన సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ లో వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. బుచ్చిబాబు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ కూడా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మధ్య వైష్ణవ్ తేజ్ కి అలాగే వరుణ్ కి కొంచెం మసాలా కంటెంట్ ఉన్న… కథలు వచ్చాయట.. అయితే అవి చేయడానికి మెగాస్టార్ ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదని తెలుస్తుంది. కథ ఎంతైనా బాగుండొచ్చు .. కానీ మెగా ఫ్యామిలీలో అలాంటి కథలు ఎంత బావున్నా కూడా చేయడం కుదరదని చిరంజీవి యువ హీరోలకు తేల్చి చెప్పేశారట. గతంలో నిహారిక, సాయి ధరమ్ తేజ్ విషయంలో కూడా మెగాస్టార్.. ఇలాంటి కథల విషయంలో చాలా సీరియస్ అయ్యారట. ఇక మెగా హీరోల కథల పై నిత్యం ఓ కన్నేసి ఉంచుతున్నారట మెగాస్టార్. ఎప్పటికప్పుడు మెగా హీరోలందరికీ ఈ విషయంలో ప్రత్యేకంగా క్లాస్ కూడా పీకుతున్నారట. మెగా హీరో ఏ చిత్రం చేయాలనుకున్నా ముందు మెగాస్టార్ కథ విని ఓకే చేసిన తరువాతే… అని స్పష్టమవుతుంది. ఇక తాజాగా వైష్ణవ్ తేజ్ చిత్రాన్ని బాగా వచ్చేలా చూసుకోమని… సుకుమార్ కి చెప్పినట్టు తెలుస్తుంది. వైష్ణవ్ తేజ్ కూడా తన అన్న సాయి ధరమ్ తేజ్ మాట కంటే కూడా తన మావయ్య మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus