Chiranjeevi: దర్శకత్వాన్ని చిరంజీవి ఎలా వివరించారంటే?

  • April 30, 2022 / 06:14 PM IST

150కిపైగా సినిమాల అనుభవం ఉంది… దర్శకత్వం చేసే ఆలోచన ఏమైనా ఉందా అని చిరంజీవిని యువ దర్శకులు అడిగారు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారింది. దర్శకత్వం అంటే ఏంటో చెబుతూనే, తను దర్శకుడిగా వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా చెప్పారు చిరంజీవి. అవేంటో ఆయన మాటల్లోనే చదివేయండి. అన్ని శాఖల్లోనూ అవగాహన ఉంది, అబ్జర్వ్‌ చేస్తున్నాను కాబట్టి ఏ శాఖలో ఏంటి, కెమెరా పనితనం ఏంటి, మ్యూజిక్‌ ఏంటి, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏంటి అనే అవగాహన ఉన్న నాకు డైరక్షన్‌ పెద్ద కష్టం అనిపిచందు.

అది చాలా ఈజీ అనిపిస్తుంది అన్నారు చిరంజీవి. చక్కగా వండితే.. ఎవరైనా వడ్డించేస్తారు. అలా మంచి కథ, కథనం పడితే.. ఎవరైనా సినిమా తీయొచ్చు అని అన్నారు చిరు. దానికి లెన్స్‌లు మార్చి ట్రాలీలు వేయడం, క్లోజప్‌లు తీయడం, డ్రోన్లతో తీయడం, క్రేన్లతో తీయడం వంటి వడ్డింపు చేస్తే సరిపోతుంది అని చెప్పారు. డైరక్షన్‌ అంటే కథ, కథనం, కథాగమనం లాంటివి చేయగలిగితే చాలు. అవన్నీ సరిగ్గా ఉంటే మిగిలినవి అద్భుతంగా కుదిరిపోతాయి.

నాకైతే అవకాశం వస్తే డైరక్షన్‌ చేయాలని ఉంది. ఆ అవకాశం, ఆ టైమ్‌ ఇవ్వకుండా సినిమా తర్వాత సినిమా వరుసగా వస్తున్నాయి. అయితే నాకు 70 ఏళ్లు వచ్చిన తర్వాత కచ్చితంగా సినిమా డైరక్షన్‌ చేస్తాను. అప్పుడు డైరక్టర్‌గా మీలాంటి కుర్ర దర్శకులకు టఫ్‌ టైమ్‌ ఇస్తాను అని అన్నారు చిరంజీవి. దీంతోపాటు చిరంజీవి నేటితరం దర్శకులు చేస్తున్న తప్పిదం గురించి కూడా చెప్పారు. ఇటీవల కాలంలో దర్శకులు.. కథ బాగుంది.. ఇక నాలుగు సీన్లేసుకొని షూటింగ్‌కి వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారు.

నిశితంగా బూతద్దంలో చూసుకొని, లాజిక్‌లు వెతుక్కుంటే కనుక ప్రతి కథ ఇంకా చేయాల్సి ఉంటుంది. ‘వాల్తేరు వీరయ్య’ కథ చెబితే అందరూ బాగుందన్నారు అని బాబీ ఆనందపడ్డాడు. అయితే ఇప్పుడు నీ అసలు పని మొదలైంది అని బాబీతో అన్నాను. ‘‘సినిమా కోర్‌ పాయింట్‌ విని అందరూ బాగుంది అంటున్నారు. ఇప్పుడు ఈ కథ మీద కూర్చుని గ్రే ఏరియాలు పట్టుకొని పక్డబందీగా రాసుకోవాలి’’ అని చెప్పాను. వెంటనే బాబీ.. రియాక్ట్‌ అయ్యి సినిమాను ఇంకా పటిష్ఠంగా రాసుకున్నాడు.

బాబీలో ఉన్న టాలెంట్‌ అదే. చెప్పినదాన్ని అద్భుతంగా మలచుకున్నాడు. అలా అని జీవితాంతం రాసుకొని ఉండలేం కదా. ఎక్కడో దగ్గర కథ, కథనం రాతలో ఫుల్‌స్టాప్‌ పెట్టి సినిమా చేయాలి. లేకపోతే జీవితాంతం రాస్తూనే ఉంటారు అని నవ్వేశారు చిరంజీవి. సో… మరో ఐదారేళ్లలో చిరంజీవిని దర్శకుడిగా చూస్తామన్నమాట.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus