Chiranjeevi: భోళా శంకర్ ఆన్ లొకేషన్ వీడియోని లీక్ చేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి తాను నటించే సినిమాలకి సంబంధించి అయినా, తన ఫ్యామిలీ హీరోల సినిమాలకి సంబంధించి అయినా.. ఏదో ఒక కీలక విషయాన్ని లీక్ చేసేస్తుంటారు. గతంలో ‘రంగస్థలం’ క్లైమాక్స్ ను చిరు లీక్ చేసేశారు. ఆది పాత్ర చనిపోతుంది చిరు ముందుగానే చెప్పేశారు. ఓ రకంగా అలా చెప్పడమే మంచిదైంది. ప్రేక్షకులను ప్రిపేర్ చేసినట్టు అయ్యింది. అలాగే తన సినిమాలు ‘ఆచార్య’ ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్స్ ను అఫీషియల్ గా ప్రకటించకముందే లీక్ చేసేశారు చిరు.

అలాగే ‘ఉప్పెన’ క్లైమాక్స్ పై కూడా హింట్ ఇచ్చేశారు. తనకు ఏడైనా విషయం తెలిస్తే దానిని దాచుకోలేను అంటూ ఈ విషయం పై చిరు సరదాగా స్పందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ‘ఆచార్య’ టీజర్ రిలీజ్ టైంలో తన పై తనే మీమ్స్ వేసుకుని చిరు హైలెట్ అయ్యారు. ఇక తాజాగా భోళా శంకర్ కి సంబంధించి కూడా చిరు ఓ లీక్ ఇచ్చారు. ఆ సినిమా సెట్స్ నుండి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని లీక్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే.. ఇది ఓ సాంగ్ కి సంబంధించినది అనిపిస్తుంది.

ఈ వీడియోలో (Chiranjeevi) చిరుతో పాటు కీర్తి సురేష్, తమన్నా, సుశాంత్, రఘుబాబు, వైవా హర్ష, వెన్నెల కిషోర్ వంటి వారు కూడా కనిపిస్తున్నారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘చిరు లీక్స్’ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేశారు చిరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus