Venkatesh :వెంకటేష్ కుమార్తె నిశ్చితార్థంలో సందడి చేసిన చిరు మహేష్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో హీరో వెంకటేష్ ఒకరు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి వెంకటేష్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతోమంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వెంకటేష్ ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఇక సెలబ్రిటీలు అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటారు వారికి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా వారి కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

కానీ వెంకటేష్ మాత్రం ఇందుకు పూర్తిగా విభిన్నం అని చెప్పాలి. ఈయన ఎక్కడ కూడా తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను బయటకు రానివ్వరు. ఎలాంటి విషయమైనా చాలా గోప్యంగా ఉంచుతారనే విషయం మనకు తెలిసిందే.ఇకపోతే వెంకటేష్ పిల్లల విషయానికి వస్తే ఈయనకు నలుగురు సంతానం కాగా ముగ్గురు అమ్మాయిలు ఇప్పటికే పెద్ద కుమార్తె వివాహం జరిగింది తాజాగా రెండో కుమార్తె హయవాహిని పెళ్లి కూడా సెట్ అయిందని తెలుస్తుంది. ఈమెను విజయవాడకు చెందిన ప్రముఖ డాక్టర్ కుటుంబానికి కోడలుగా పంపించబోతున్నారని తెలుస్తుంది. వెంకటేష్ రెండవ కుమార్తె పెళ్లి గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఎక్కడ కూడా స్పందించలేదు.

బుధవారం సాయంత్రం విజయవాడలో చాలా సైలెంట్గా వెంకటేష్ తన రెండో కుమార్తె నిశ్చితార్థపు వేడుకలను ఘనంగా నిర్వహించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నిశ్చితార్థ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు అయినటువంటి మహేష్ బాబు చిరంజీవి వంటి సెలబ్రిటీలు హాజరయ్యారని తెలుస్తుంది. ఇలా వెంకటేష్ కుమార్తె నిశ్చితార్థం ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవ్వడమే కాకుండా వెంకి కూతురికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus