Chiranjeevi: చిరంజీవి కామెంట్ల విషయంలో ఊహించని ట్విస్టులు.. అక్కడే తప్పు జరిగిందా?

  • August 10, 2023 / 04:48 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో చీమకు కూడా అపకారం చేయని హీరోల జాబితాలో చిరంజీవి ముందువరసలో ఉంటారు. చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఏపీ ప్రభుత్వాన్ని చిరంజీవి టార్గెట్ చేయలేదని చిరంజీవి చెప్పని కామెంట్లను సైతం చెప్పినట్టు కొంతమంది ప్రచారం చేశారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో వీడియోను ఎడిట్ చేసి రిలీజ్ చేశారని కొంతమంది చెబుతున్నారు. చిరంజీవి స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

చిరంజీవి (Chiranjeevi) ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఫ్యాన్స్ కట్టుబడి ఉంటారు. అభిమానులు చిరంజీవిని ఏ స్థాయిలో ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి కన్ఫ్యూజన్ కు తెర దించాలని అభిమానులు భావిస్తున్నారు. భోళా శంకర్ సినిమాకు ఏపీలో టికెట్ రేట్ల పెంపు లేదని తేలిపోయింది. టికెట్ రేట్ల పెంపు లేకపోవడం వల్ల భోళా శంకర్ కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంది.

ఏపీలోని కొన్ని థియేటర్లలో భోళా శంకర్ బుకింగ్స్ మొదలు కాగా మరికొన్ని థియేటర్లలో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ మొదలుకావాల్సి ఉంది. భోళా శంకర్ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు ఉండనున్నాయని తెలుస్తోంది. భోళా శంకర్ కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

భోళా శంకర్ మూవీ సాంగ్స్ ఇప్పటికే హిట్ అయ్యాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా రోల్ కంటే కీర్తి సురేష్ రోల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండనుంది. మెహర్ రమేష్ ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాలో ట్విస్టులు ఉన్నాయని తెలుస్తోంది. దాదాపుగా 70 శాతం మార్పులతో ఈ సినిమా తీశానని మెహర్ రమేష్ చెబుతున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus