మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాతో మెహర్ రమేష్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని నమ్ముతున్నారు. భోళా శంకర్ సినిమా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కిందని సమాచారం అందుతోంది. అయితే భోళా శంకర్ సినిమాతో మెహర్ రమేష్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. అయితే భోళా శంకర్ సినిమాకు పోటీగా జైలర్ సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
ప్రముఖ నిర్మాత వల్ల ఉత్తరాంధ్ర స్పై సినిమా హక్కులు కావాలంటే జైలర్ సినిమాకు ఇప్పటినుంచే థియేటర్లు కేటాయించేలా అగ్రిమెంట్లు జరుగుతున్నాయని సమాచారం. ఈ విధంగా చేయడం వల్ల భోళా శంకర్ ఉత్తరాంధ్రలో మంచి థియేటర్లను కోల్పోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే సమయంలో పెద్ద సినిమాల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. భోళా శంకర్, జైలర్, యానిమల్ సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి.
ఈ మూడు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ మూడు సినిమాల బడ్జెట్ 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువని సమాచారం. భోళా శంకర్ సినిమాకు మంచి థియేటర్లు దక్కితే కలెక్షన్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భోళా శంకర్ సినిమాకు అనిల్ సుంకర నిర్మాత అనే సంగతి తెలిసిందే.
ఏజెంట్ సినిమా హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు భోళా శంకర్ మూవీ హక్కులను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. భోళా శంకర్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందేమో చూడాలి. భోళా శంకర్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని (Chiranjeevi) ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!