త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘చిరు 151’..?
- June 18, 2016 / 02:55 PM ISTByFilmy Focus
దర్శకరత్న దాసరి నారాయణ నిర్మించనున్న చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనుండగా.. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా చిరు 151 వ చిత్రాన్ని కూడా దాసరి నారాయణే నిర్మించనున్నాడనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇటీవలే కాపు రిజర్వేషన్ల పై వీరిద్దరి ఒక్కటి కాగా.. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న విభేధాలు సమసిపోయాయని, త్రివిక్రమ్ దర్శకుడిగా వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం రానుందని వార్తలు వినవస్తున్నాయి. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లంకేశ్వరుడు మంచి విజయాన్ని అందుకోగా..చిరు నటించిన జై చిరంజీవ చిత్రానికి కథ స్క్రీన్ ప్లేను త్రివిక్రమ్ అందించాడు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















