152వ సినిమాపై స్పందించిన చిరంజీవి

ఖైదీ నంబర్ 150 సినిమా తర్వాత చిరంజీవి సైరా మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే.. 152 వ చిత్రంపై రూమర్స్ పుట్టుకొచ్చాయి. మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను సినిమా చేస్తారని కొన్ని రోజులు వార్తలు చక్కర్లు కొట్టగా.. రంగస్థలం సినిమా హిట్ అయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలోనే నటిస్తారని గాసిప్ సోషల్ మీడియాలో జోరు అందుకుంది. ఈ వార్తలపై ఇంతవరకు చిరంజీవి స్పందించలేదు. ఈరోజు అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీ మహానటి యూనిట్‌ని మెగాస్టార్ అభినందించారు. ఈ చిత్ర నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్‌లను, దర్శకుడు నాగ్ అశ్విన్‌ను తన ఇంటికి ఆహ్వానించి వారికి పట్టు శాలువలు కప్పి సత్కరించారు.

ఈ సందర్భంగా చిరు సన్నిహితులతో మాట్లాడుతూ నెక్స్ట్ సినిమా గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని చెప్పిన్నట్లు తెలిసింది. ఇప్పటివరకు వచ్చిన వార్తల్లో ఏది నిజం కాదని, తాను ఎవరికీ ఓకే చెప్పలేదని స్పష్టంచేసినట్లు సమాచారం. ఇక సైరా విషయానికి వస్తే ఇప్పటికే రెండు షెడ్యూళ్లు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సోమవారం నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన కోయిలకుంట్ల ట్రెజరీ సెట్ లో మూడూ షెడ్యూల్ మొదలు కాబోతోంది. ఈ షూటింగ్ లో చిరు, జగపతి బాబులతో పాటు తమన్నా కూడా పాల్గొనబోతోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదికి వేసవిలో థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus