ఒరిజినల్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిరు రీమేక్స్

చిరంజీవి సినిమాలు అంటే బాక్సఫీస్ దగ్గర మినిమం కలెక్ట్ చేస్తాయి. హాట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా నిర్మాతలకి ఎక్కువ లాభం తెచ్చి పెట్టిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అయితే చిరు కెరీర్ డైరెక్ట్ సినిమాలు ఎలా అయితే హిట్స్, సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయో కొన్ని రీమేక్స్ కూడా బాక్సఫీస్ దగ్గర అలానే హిట్ అయ్యాయి.

హిట్లర్, ఘరానా మొగుడు సినిమాల నుండి మొన్న వచ్చిన గాడ్ ఫాదర్ వరకు చిరు చేసిన రీమేక్ సినిమాలు బాక్సఫీస్ దగ్గర ఒరిజినల్ సినిమాల కంటే కూడా ఎక్కువ వసూళ్లు రాబట్టాయి.

ఇందులో కొన్ని చిరు రీమేక్స్ వాటికి వచ్చిన కలెక్షన్స్ ఇప్పుడు చూసేద్దాం…

1) హిట్లర్ మలయాళం మూవీ కలెక్షన్స్ 10 కోట్లు గ్రాస్ – హిట్లర్ తెలుగు  15+ 10 కోట్లు గ్రాస్

2) పూవును పుతియా పూంతేంనల్ 3-4 కోట్లు –  పసివాడి ప్రాణం 5+కోట్లు

3) అమ్మన్ కోవిల్ కిజకాలే 3 కోట్లు – ఖైదీ No 786 5+ కోట్లు

4) అనురాగ అరళితు – 5-6 కోట్లు – ఘరానా మొగుడు – 10+ కోట్లు (First Telugu Movie to cross 10+ Crore)

5) రమణ 15 కోట్లు – ఠాగూర్ 28+కోట్లు

6) మున్నా భాయ్ 37 కోట్లు – శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ 28+ కోట్లు

7) కత్తి 130 కోట్లు- ఖైదీ నం 150 165+ కోట్లు

8) లూసిఫెర్ 300 కోట్లు – గాడ్ ఫాదర్ 108 కోట్లు

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus