Chiranjeevi: 40 ఏళ్ళ ‘ఖైదీ’ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చిరు ఆసక్తికర పోస్ట్..!

  • October 28, 2023 / 10:34 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ’ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1983 వ సంవత్సరంలో అక్టోబర్ 28న ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘సంయుక్తా మూవీస్’ బ్యానర్ పై కె.ధనుంజయ రెడ్డి, కె.నరసారెడ్డి, ఎస్.సుధాకర్ రెడ్డి.. లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఏ.కోదండరామిరెడ్డి దర్శకుడు. ఈ సినిమాలో చిరంజీవి చేసిన యాక్షన్ ఎపిసోడ్స్, డాన్స్ అప్పట్లో సెపరేట్ ట్రెండ్ ను సృష్టించాయి.

ఇక ఈ చిత్రం యొక్క జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చిరు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వేయడం జరిగింది. ఆ ట్వీట్ ద్వారా చిరు స్పందిస్తూ.. “‘ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది.

ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ , ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి సోదరులను, నా కో- స్టార్స్ సుమలత , మాధవి లని మొత్తం టీమ్ ని అభినందిస్తూ, అంత గొప్ప విజయాన్ని మా కందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు! ” అంటూ (Chiranjeevi) రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus