ప్రభాస్, నిహారిక పెళ్లిపై స్పందించిన చిరంజీవి

బాహుబలి సినిమాతో ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యారు. అతనికి సంబంధించిన ఏ విషయమైనా ఇప్పుడు జాతీయ వార్త అవుతోంది. నిన్నటి నుంచి అనేక నేషనల్ న్యూస్ ఛానల్స్ ప్రభాస్ పెళ్లి విషయపై ఓ వార్తను ప్రసారం చేస్తున్నాయి. “ప్రభాస్ పెళ్లిచేసుకోబోయేది.. అనుష్కని కాదు.. నిహారికని ” అంటూ ఊదరగొట్టాయి. జాతీయ మీడియా ప్రసారం చేయడంతో స్థానిక ఛానల్స్ వాళ్ళు కూడా అదే పాట పాడారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తమ హీరోకి పెళ్లి చేసుకోబోతున్నారని సంబరపడ్డారు. అయితే ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ సీరియస్ గా తీసుకుంది. మెగాస్టార్ చిరంజీవి మీడియాపై మండిపడ్డారు. సైరా నరసింహారెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ అన్ని ఛానల్స్ వారికీ ప్రకటన విడుదల చేశారు. “నిహారికకు ఇప్పట్లో పెళ్లి చేసే యోచన లేదు.

ఆమెకి మంచి భవిష్యత్తు ఉంది” అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి గాలి వార్తలను ప్రసారం చేయవద్దని స్పష్టంచేశారు. గత కొంతకాలంగా నిహారిక పెళ్లి విషయంలో పుకార్లు వస్తున్నాయి. నిహారిక పెళ్లి సాయిధ‌ర‌మ్ తేజ్‌తో జ‌ర‌గ‌నుంద‌ని, ఆ త‌ర్వాత నాగ శౌర్య‌తో అంటూ రూమ‌ర్స్ షికారు చేశాయి. వాటిని సాయిధ‌ర‌మ్ తేజ్‌, నాగ శౌర్య‌ లు స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఖండించారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో షూటింగ్ నిమిత్తం దుబాయ్ లో ఉండడంతో మీడియాతో మాట్లాడలేకపోయారు. ప్రభాస్ పెళ్లి అయ్యేంతవరకు ఈ గాసిప్స్ కి అడ్డువుండదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus