Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన ఫోటోలు వాడుతూ ట్రోలింగ్ చేస్తున్న సోషల్ మీడియా నెటిజెన్లపై కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. సౌమ్యంగా ఉండే చిరు, ఎంతో ఓపిగ్గా ఉండే చిరు అలా కఠిన చర్యలు తీసుకోవడం ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా దీనిపై ఆయన శైలిలో వివరణ కూడా ఇచ్చారు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాదులోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ‘రన్ ఫర్ యూనిటీ’ అనే కార్యక్రమంలో చిరు పాల్గొన్నారు.

Chiranjeevi

ఈ సందర్భంగా డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలతో కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్ ను కూడా చిరు గుర్తు చేసుకున్నారు. ‘టెక్నాలజీ మంచిదే, కానీ దాన్ని తప్పుగా వాడితే జరిగే నష్టం ఊహించలేం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిరు. ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్న డీప్‌ఫేక్, ఏఐ (AI) ఎడిటింగ్‌..ల పెను ప్రమాదంపై కూడా ధ్వజమెత్తారు.

చిరు మాట్లాడుతూ.. “టెక్నాలజీని మనం స్వాగతించాలి, కానీ దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా డీప్‌ఫేక్, ఏఐ ఎడిటింగ్‌లతో జరుగుతున్న ట్రోలింగ్ చాలా మందిని తప్పుదోవ పట్టిస్తుంది. వీటిపై ప్రభుత్వాలు వెంటనే స్పందించి, కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఈ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. త్వరలోనే కొత్త చట్టాలు అమల్లోకి వస్తాయి అని ఆశిస్తున్నాను.

డీప్‌ఫేక్ కేసులను ఛేదించడంలో హైదరాబాద్ సైబర్ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు, సీపీ సజ్జనార్ నాయకత్వంలో ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే, చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను మెగా సంక్రాంతి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus