మెగాస్టార్ చిరంజీవికి కోవిడ్ వచ్చింది అంటేనే.. ఆయన అభిమానులు తట్టుకోలేకపోయారు. అలాంటిది ఆయనకు క్యాన్సర్ అంటే.. పైన పెట్టిన హెడ్డింగ్, ఎంతో మందికి కోపం తెప్పిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇది మేము చెబుతున్న మాట కాదు. స్వయంగా చిరంజీవి చెప్పిన మాట. హైదరాబాద్‌లో శనివారం నాడు ఓ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకకు గెస్ట్ గా వెళ్లిన చిరంజీవి..అక్కడ ప్రసంగిస్తూ ఈ విషయాన్ని బయటపెట్టారు.
చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ.. ” గతంలో నేను కూడా క్యాన్సర్ భారిన పడ్డాను. కానీ ఆరంభదశలోనే దానిని గుర్తించి సకాలంలో చికిత్స తీసుకోవడంతో.. నేను ప్రాణాలతో బయటపడ్డాను. క్యాన్సర్ వచ్చిందని చెప్పడానికి నేనేం భయపడలేదు. ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ పెద్ద జబ్బు కాదు” అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. అలాగే… ‘ఈరోజు నాకు డబ్బు ఉంది కాబట్టి.. నేను మెరుగైన వైద్యం చేయించుకుని బయటపడ్డాను. కానీ సినీ కార్మికులు చాలా పేద వాళ్ళు.
ఇలాంటి వాటికి చాలా భయపడతారు. అలాంటి వారికి టెస్టులు చేయించి, సకాలంలో అంటే మొదటి దశలోనే క్యాన్సర్ నుండి బయటపడడానికి వారి మేలైన వైద్యం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఎండనకా, వాననకా.. రాళ్లు రప్పలు అని చూసుకోకుండా సినిమా కోసం కష్టపడుతుంటారు. వాళ్ళందరికీ టెస్టులు చేయించాడనికి ఏదైనా మెడికల్ క్యాంప్ ను నిర్వహించడం వీలవుతుందా? ఖర్చు అంతా నేను భరిస్తాను.
నాకు భగవంతుడు డబ్బు ఇచ్చాడు’ అంటూ హాస్పిటల్ యాజమాన్యంతో చిరంజీవి మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా చిరు నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. ఆ సర్వీస్ ను ప్రొవైడ్ చేస్తామని హామీ ఇచ్చారు.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!