Chiranjeevi: చిరంజీవి ఆ కారణం వల్లే బ్లడ్ బ్యాంక్ పెట్టారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో చిరంజీవి ఒకరు. ఆరు పదుల వయస్సులో కూడా వరుస సినిమాలలో నటిస్తున్న చిరంజీవి సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రజల కోసం ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నీఇన్నీ కావు. ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆయన ప్రజలకు మరింత దగ్గరయ్యారు. తాను మెగాస్టార్ గా గుర్తింపు సంపాదించుకోవడానికి కారణమైన అభిమానులకు ,

ప్రేక్షకులకు తన వంతు సహాయం అందించే విషయంలో ఆయన ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక సందర్భంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టడం వనుక ఉన్న కారణాలను వెల్లడించారు. మొదట్లో నా ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నేను భావించేవాడినని ఆయన అన్నారు. పెద్దపెద్ద కార్లు కొనాలని, పెద్దపెద్ద బంగళాలు కొనుగోలు చేయాలని నాకు కూడా ఉండేదని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత కాలంలో నాకు రావడంతో పాటు డబ్బులు రావడం మొదలయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే ఆ తర్వాత తృప్తి అనేదానికి అంతం లేదని నాకు అనిపించిందని చిరంజీవి కామెంట్లు చేశారు. ఎక్కడైతే తృప్తి లేదో అక్కడ మానసిక శాంతి కూడా లభించదని చిరంజీవి చెప్పుకొచ్చారు. అభిమానులకు ప్రత్యుపకారంగా ఏదో ఒకటి చేయాలని బ్లడ్ బ్యాంక్ పెట్టానని చిరంజీవి కామెంట్లు చేశారు. ప్రేక్షకులకు ఏం తిరిగిస్తున్నాననే ప్రశ్నలోంచి బ్లడ్ బ్యాంక్ పుట్టిందని చిరంజీవి వెల్లడించారు. బ్లడ్ బ్యాంక్ విజయవంతంగా ముందుకు వెళుతోందంటే గొప్పమనసు ఉన్నవాళ్లు సహకరించి

నాతో పాటు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడం వల్లేనని చిరంజీవి చెప్పుకొచ్చారు. చిరంజీవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలలో నటిస్తున్నారు. ఈ సినిమాలపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus